హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో జరుగుతున్న గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.
ఆదివారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుండి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ హెలికాప్టర్‌లో బయలుదేరి జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాలలో విహంగ వీక్షణం చేశారు.
మంత్రుల వెంట డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్ ఉన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ లక్షలాది మంది పాల్గొనే హైదరాబాద్‌లో నిర్వహించే గణేష్ శోభాయాత్రకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.
శోభాయాత్ర, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
అన్ని పండుగలను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని కోరారు.
అంతకుముందు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి హెలికాప్టర్ ఎక్కారు.
Ramadan 2022 Photos: హైదరాబాద్‌లో ఘనంగా రంజాన్ వేడుకలు - మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు
In Pics : తెలంగాణ ప్రభుత్వ ఇఫ్తార్ విందు, పాల్గొన్న సీఎం కేసీఆర్
TRS Plenary Photos: గులాబీ రంగు అద్దుకున్న హైదరాబాద్- ప్లీనరీతో టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం
In Pics: 3 టిమ్స్ ఆస్పత్రులకు కేసీఆర్ శంకుస్థాపన - భవన ఆకృతుల ఫోటోలు ఇవీ
In Pics: బండి సంజయ్‌కు అస్వస్థత, పాదయాత్రలోనే వైద్య పరీక్షలు - ఫోటోలు
MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి