Anantapur: బ్యాలెట్ బాక్సులో వింత కోరిక.. ఆ స్లిప్ చదివిన అధికారులు అవాక్కు, నవ్వుకుంటున్న జనం.. వైరల్ వీడియో
రాష్ట్రంలో మద్యం బ్రాండ్లతో విసుగెత్తిపోతున్నామని ఓ మందుబాబు ఆవేదన చెందాడు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న మద్యాన్ని నిలిపి వేసి.. మంచి బ్రాండ్లను దుకాణాల్లో ప్రవేశపెట్టాలని రాసి బ్యాలెట్ బాక్సులో వేశాడు.
ఈ ప్రపంచంలో ఒక్కో వ్యక్తికి ఒక్కో సమస్య ఉంటుంది. వ్యాపారికి ఆ రంగంలో ఇబ్బందులుంటే.. ఉద్యోగికి కూడా తాను పని చేసే చోట కష్టాలుండడం జరుగుతుంటుంది. మొత్తానికి సమాజంలో ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. అవకాశం రావాలే కానీ, ఎవరికి వారు తమ ఇబ్బందుల గురించి ఏకరువు పెట్టేస్తుంటారు. కానీ, ఇప్పుడు జరిగిన ఓ పరిణామం మాత్రం దిమ్మతిరిగే స్థాయిలో ఉంది. ఓ వ్యక్తి తనకు వ్యక్తిగతంగా ఎదురైన సమస్యను ప్రభుత్వం దృష్టికి తేవాలనుకున్నాడు. అందుకు ఎన్నికలు సరైన వేదిక అనుకున్నాడో ఏమో.. ఏకంగా అంతా అవాక్కయ్యే పని చేశాడు.
Also Read: ‘50 కోట్లతో ఆ సీటు కొన్నవ్.. దగుల్బాజీ, ఆడోళ్లు చీపుర్లు తిరగేస్తరు..’ మళ్లీ రెచ్చిపోయిన మంత్రి
ఓటేయడంతో పాటు బ్యాలెట్ బాక్సులో తన విజ్ఞప్తిని కూడా రాసి అందులో వేశాడు. నేడు (సెప్టెంబరు 19) ఓట్లు లెక్కిస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లాలో ఓ మందుబాబు చేసిన పని అందర్నీ ఆకర్షించింది. జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అతడు చేసిన పని వెలుగులోకి రావడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది బ్యాలెట్ బాక్సులో ఒక స్లిప్పును అధికారులు గమనించారు. ఏంటా అని దాన్ని తెరిచి చూసి అంతా అవాక్కయ్యారు. కాసేపు ఫక్కున నవ్వుకున్నారు.
Also Read: Photos: నిమజ్జనం వేళ Hyd విహంగ వీక్షణం, మెట్రో ఒంపుసొంపులతో అందమైన సిటీని పైనుంచి చూడండి
ఇంతకీ ఆ మందుబాబు కోరిక ఏంటంటే.. రాష్ట్రంలో ప్రభుత్వం తెచ్చిన వివిధ రకాల మద్యం బ్రాండ్లతో విసుగెత్తిపోతున్నామని చెప్పాడు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న మద్యాన్ని నిలిపి వేసి.. మంచి బ్రాండ్లను దుకాణాల్లో ప్రవేశపెట్టాలని విన్నవించాడు. తమ ప్రాంతంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కూలింగ్ బీర్లతో పాటు మెరుగైన బ్రాండ్లకు చెందిన లిక్కర్‌ను కూడా అందుబాటులో ఉంచాలని హితవు పలికాడు. జిల్లాలో నల్ల చెరువు మండలంలోని తలమర్లవాండ్లపల్లి ఎంపీటీసీ పరిధిలోని ఓ మందుబాబు ప్రభుత్వానికి ఈ కోరిక విన్నవించాడు. చీటీలో నల్లచెరువు యూత్ మందుబాబులు అంటూ రాసి సంతకం కూడా చేశాడు. ఈ స్లిప్పును బ్యాలెట్ బాక్సులో వేయడంతో అధికారుల కంట పడింది. ప్రస్తుతం ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
Also Read: AP Elections: టీడీపీ తప్పుకోవడం పెద్ద డ్రామా.. దుష్ట ప్రయత్నాలు ఫలించలేదు: సజ్జల, అంబటి ఫైర్