AP ZP Chairman Elections: ఏపీలో ఎంపీపీ, జడ్పీ చైర్మన్ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల.. ఈ ఏడాది కొన్ని మార్పులతో ఎన్నికలు
నేటి ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ ఎన్నికలకు ఏపీ ఎన్నికల సంఘం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ZP Chairman Election In AP: ఆంధ్రప్రదేశ్‌లో నేడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. మరోవైపు నేటి ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ ఎన్నికలకు ఏపీ ఎన్నికల సంఘం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మండల (ఎంపీపీ), జిల్లా పరిషత్ అధ్యక్షులు (జిల్లా పరిషత్ చైర్మన్), ఉపాధ్యక్షుల ఎన్నికకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ మేరకు ఏపీ ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.
సెప్టెంబర్ 24న ఎంపీపీ ఎన్నికలు, సెప్టెంబర్ 25న జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించనున్నారు. 24న మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించనుండగా.. 25న మధ్యాహ్నం 3 గంటలకు జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఇప్పటివరకూ ఒక చైర్మన్, వైస్ చైర్మన్‌ను సంబంధిత సభ్యులు ఎన్నుకునేవారు. ఏపీ పంచాయతీరాజ్ చట్టంలో సవరణలతో రెండో వైస్ చైర్మన్‌ను ఇకనుంచి ఎన్నుకోవాల్సి ఉంటుంది. నేటి ఉదయం మొదలైన ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. కొన్ని జిల్లాల్లో క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ దూసుకెళ్తోంది. అయితే ఈ ఎన్నికలను ప్రతిపక్ష టీడీపీ బహిష్కరించడం తెలిసిందే. కానీ కొన్నిచోట్ల మాత్రం అభ్యర్థులు బరిలోకి దిగారు.
Also Read: పరిషత్ ఎన్నికల్లో వైసీపీ హవా... ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల్లో ఆధిక్యం...
కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన పరిషత్ ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ తర్వాత కోర్టు ఆదేశాలతో ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఈ ఎన్నికలు జరగడంతో వీటిని రద్దు చేసి మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పీల్ చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ కేసును విచారించింది. చివరకు సెప్టెంబర్ 16న ఓట్లు లెక్కించి, ఫలితాలు వెల్లడించాలని ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సీఎం జగన్ ఉన్న చోట వైసీపీకి షాకింగ్ రిజల్ట్
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంటున్న మంగళగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీకి దిమ్మతిరిగే రిజల్ట్ వచ్చింది. ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డికి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు షాక్ ఇచ్చారు. పోటీ చేసిన 18 స్థానాల్లో కేవలం 7 చోట్ల మాత్రమే వైసీపీ విజయం సాధించింది.