Ramyakrishnan : వామ్మో... రమ్యకృష్ణను ఇలా ఎప్పుడైనా చూశారా? - RGV సినిమానా మజాకా!
RGV Mein Bhoot : ఆర్జీవీ మరో హారర్ థ్రిల్లర్ 'పోలీస్ స్టేషన్ ఇన్ భూత్' నుంచి మరో సర్ ప్రైజ్ వచ్చేసింది. సినిమాలో రమ్యకృష్ణ లుక్ రివీల్ చేశారు డైరెక్టర్ ఆర్జీవీ.

Ramya Krishnan New Horror Look In RGV's Police Station Mein Bhoot Movie : సెన్సేషనల్ డైరెక్టర్ ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ తన పాత రూట్, ఇష్టమైన హారర్ థ్రిల్లర్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. పోలీస్ స్టేషన్‌లోకే దెయ్యాలు వస్తే ఎలా? అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో 'పోలీస్ స్టేషన్ మే భూత్' అనౌన్స్ చేశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్ భయంతో పాటు భారీ హైప్ క్రియేట్ చేయగా... తాజాగా మరో పోస్టర్ వదిలారు ఆర్జీవీ.
నమ్మండి ఇది రమ్యకృష్ణ
ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించనున్నారు. సోమవారం ఉదయం ఆమె లుక్ రిలీజ్ చేయగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. నుదిటిన చుక్కల తిలకం, భయంకరమైన కాటుక కళ్లు, డిఫరెంట్ జ్యువెలరీతో జుట్టు విరబూసుకుని హారర్ లుక్‌లో భయపెట్టేశారు. ఆమె రోల్ ఏంటి అనేది రివీల్ చేయకపోయినప్పటికీ లుక్ చూస్తుంటే మాత్రం మాంత్రికురాలి పాత్ర పోషించనున్నట్లు అర్థమవుతోంది.
Here is @meramyakrishnan in POLICE STATION MEIN BHOOT pic.twitter.com/RZejGAW3gi
— Ram Gopal Varma (@RGVzoomin) November 3, 2025
ఈ మూవీలో బాలీవుడ్ మనోజ్ బాజ్‌పాయ్, జెనీలియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మనోజ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా... ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ భయపెట్టేసింది. పోలీస్ స్టేషన్లోనే దెయ్యాలుండడం, ఆయన చేతిలో ఓ దెయ్యం బొమ్మ ఉండడం హారర్‌కే హారర్ పుట్టించేలా ఉంది.
ఓ భయంకరమైన గ్యాంగ్ స్టర్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేస్తారు. తనను అన్యాయంగా చంపేశారనే పగతో ఆ గ్యాంగ్ స్టర్ దెయ్యంలా మారి తిరిగి అదే పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఒక్కొక్కరినీ వేటాడుతాడు. అందుకే ఈ 'పోలీస్ స్టేషన్ నాది భూతం' అనే టైటిల్ వచ్చింది. 'చనిపోయిన వారిని మీరు అరెస్ట్ చేయలేరు.' అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చారు ఆర్జీవీ.
ఆర్జీవీ... ఈ పేరు వింటేనే మనకు సెన్సేషనల్ మూవీస్ గుర్తొస్తాయి. ఒకప్పుడు బాక్సాఫీస్‌కు శివ, గోవిందా గోవింద, క్షణ క్షణం వంటి భారీ బ్లాక్ బస్టర్స్ అందించారు. ఎక్కువగా హారర్, థ్రిల్లర్స్, యాక్షన్, మాఫియా బ్యాక్ డ్రాప్‌గా మూవీస్ తీస్తు తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు. అప్పట్లో ఎక్కువగా హారర్, థ్రిల్లింగ్ అంశాలపైనే దృష్టి పెట్టేవారు. రీసెంట్‌గా యూటర్న్ తీసుకుని పొలిటికల్ సెటైరికల్ మూవీస్ చేశారు. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ హారర్ మూవీస్‌పై దృష్టి సారించారు. సిల్వర్ స్క్రీన్‌పై రియల్ ఘోస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించేలా ఆయన తీసిన దెయ్యం, రాత్రి, రక్ష వంటి మూవీస్ సెన్సేషన్‌గా నిలిచాయి. ఇప్పుడు మళ్లీ అదే జానర్‌లో మూవీ వస్తుండడంతో అంతకు ముందు వాటిని మించి ఇది ఓ డిఫరెంట్ హారర్ ఎక్స్‌పీరియన్స్ అవుతుందని ఆర్జీవీ ఫ్యాన్స్ అంటున్నారు.





















