KTR: కేటీఆర్‌కి అరుదైన ఆహ్వానం, ఈ ఛాన్స్ అందరికీ రాదట..! థ్యాంక్స్ చెప్పిన మంత్రి
వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రాండె, మంత్రి కేటీఆర్ నాయకత్వాన్ని ప్రశంసలతో ముంచెతారు. కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఒక అగ్రగణ్య టెక్నాలజీ పవర్ హౌస్ రాష్ట్రంగా మారిందని ప్రశంసించారు.
ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) సమావేశానికి మరోసారి మంత్రి కే.తారకరామారావుకు ఆహ్వానం లభించింది. వచ్చే సంవత్సరం జనవరి 17 నుంచి 21వ తేదీ వరకు దావోస్‌లో ఈ సమావేశం జరగనుంది. ఆహ్వానం పంపిన సందర్భంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రాండె, మంత్రి కేటీఆర్ నాయకత్వాన్ని ప్రశంసలతో ముంచెతారు. కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఒక అగ్రగణ్య టెక్నాలజీ పవర్ హౌస్ రాష్ట్రంగా మారిందని, ముఖ్యంగా కొవిడ్-19 సంక్షోభం తర్వాత వినూత్నమైన టెక్నాలజీలు, విధానాలతో ఆర్థిక వ్యవస్థ రికవరీ కోసం చేపట్టిన కార్యక్రమలపైన మంత్రి కేటీఆర్ తన అనుభవాలను పంచుకోవాలని కోరారు. దీంతో పాటు ఎమర్జింగ్ టెక్నాలజీలను సామాన్య మానవుల ప్రయోజనాలకు వినియోగించుకునే అంశంపైన కూడా తన అభిప్రాయాలను తెలపాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు కేటీఆర్‌ని కోరారు.
Also Read: Photos: నిమజ్జనం వేళ Hyd విహంగ వీక్షణం, మెట్రో ఒంపుసొంపులతో అందమైన సిటీని పైనుంచి చూడండి
ప్రపంచంలోని రాజకీయ, వ్యాపార, పౌర సమాజ నాయకులు ఉమ్మడిగా ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభాన్ని నివారించడం పైన కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా ప్రయత్నిద్దామని మంత్రి కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిపింది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి అందిన ఆహ్వానం తెలంగాణ వినూత్న విధానాలకు ప్రగతి ప్రస్థానానికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ ఆహ్వానంపైన హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్, తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఇన్నోవేషన్, ఇండస్ట్రీ రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలకు దక్కిన గుర్తింపు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం అన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేందుకు అవకాశం కలుగుతుందని, ఇక్కడి పెట్టుబడి అవకాశాలను ప్రపంచ దిగ్గజాలకు తెలియజేసి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరతామని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా తనకు ఆహ్వానం పంపిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
Telangana IT minister KTR gets invite for World Economic Forum annual meet at Davos in Jan-2022 | Hyderabad News - Times of India https://t.co/ddx3EcvthJ
— KTR (@KTRTRS) September 19, 2021
Also Read: ‘50 కోట్లతో ఆ సీటు కొన్నవ్.. దగుల్బాజీ, ఆడోళ్లు చీపుర్లు తిరగేస్తరు..’ మళ్లీ రెచ్చిపోయిన మంత్రి