By: ABP Desam | Updated at : 09 Jan 2023 03:06 PM (IST)
బండి సంజయ్‌కు విజయశాంతి సపోర్ట్
Vijayasanthi On Bandi : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని బీజేపీ నేత విజయశాంతి ప్రకటించారు. ఆయనను మారుస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. బండి సంజయ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని తరుణ్ చుగ్ కూడా చెప్పారని విజయశాంతి గుర్తు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్లో ఎదుర్కుంటున్న పరిణామాలపై సోషల్ మీడియాలో నా స్పందన చూసి, బీజేపీలోనూ రాష్ట్ర నాయకత్వ మార్పు
— VIJAYASHANTHI (@vijayashanthi_m) January 8, 2023
అని అసంబద్ధ ఊహాగానాలు కొందరు బీజేపీ వ్యతిరేకులు లేవనెత్తుతున్నారు.
ఈ అంశంపై మా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ గారు, pic.twitter.com/BDtROl4OBj
అయితే విజయశాంతి ఇలా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి తొలగింపు ప్రచారంపై స్పందించడం బీజేపీలో రకరకాల చర్చలకు కారణం అవుతోంది. నాయకత్వ మార్పు అనేది అంతర్గత అంశం. బీజేపీలో ఇలాంటివి పైకి మాట్లాడితే క్రమశిక్షణా రాహిత్యంగా భావిస్తారు. అయినా రాములమ్మ స్పందించాల్సి వచ్చింది. దీనికి కారణం.. ఇటీవల ఆమె రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ ను ఉద్దేశించి చేసినట్లుగా ప్రచారం కావడమేనని విజయశాంతి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల టీ పీసీసీ చీఫ్ గా రేవంత్ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఓ సందర్భంలో ఆయన తాను పదవి నుంచి వైదొలగడానికి సిద్ధమేనని ప్రకటించారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ములమ్మ స్పందించారు. కానీ కాంగ్రెస్ అంతర్గత విషయాలపై ఆమె ఎందుకు స్పందిస్తారని.. ఆమె తెలంగాణ పార్టీ అంశాలపైనే స్పందించారని.. ఆమె చేసిన వ్యాఖ్యలు బండి సంజయ్ కు ముడి పెట్టి కొంత మంది సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో రాములమ్మ ఉలిక్కి పడి వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తాను బండి సంజయ్‌కు వ్యతిరేకం కాదని తన సోషల్ మీడయా పోస్టు ద్వారా చెప్పకనే చెప్పినట్లయింది. ఇటీవల తెలంగాణ బీజేపీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని విజయ శాంతి కూడా ఫీలవుతున్నారు. దానికి కారణం బండి సంజయేనన్న అసంతృప్తి ఆమెకు ఉందంటున్నారు. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
తల్లి తెలంగాణ పేరుతో రాజకీయ పార్టీ పెట్టినప్పటికీ తర్వాత టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. ఆ పార్టీ తరపున ఎంపీగా గెలిచారు. కానీ తెలంగాణ ప్రకటించడంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ పార్టీ తరపున పోటీ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినా ... ఇమడలేక బయటకు వచ్చేశారు. బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో ఆమెకు ప్రత్యేకంగా ఎలాంటి పదవి ఇవ్వలేదు. బీజేపీ నేతగానే కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాల్సి వస్తుందో కూడా పార్టీ హైకమాండ్ ఆమెకు సూచనలివ్వలేదు. ఆమెకు ప్రత్యేకమైన నియోజకవర్గం లేకపోవడంతో.. సమస్య అవుతోంది. గతంలో పోటీ చేసిన మెదక్‌లో ఓడిపోయిన తర్వతా పర్యటించలేదు. దీంతో విజయశాంతి పోటీపైనా సందిగ్ధత ఏర్పడింది.
Godavarikhani Crime: షాకింగ్ - గోదావరిఖనిలో నడి రోడ్డుపై రౌడీ షీటర్ దారుణ హత్య
Bandi Sanjay: ముందస్తుకు మేం కూడా రెడీ, కానీ అదొక్కటే షరతు అంటున్న బండి సంజయ్
BRS Corporators Arrest : మేడిపల్లిలో పేకాట స్థావరంపై దాడి, డిప్యూటీ మేయర్ సహా 7గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్టు
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్
Srisailam Bus Accident : శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
IND vs NZ 2nd T20: న్యూజిలాండ్పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!
-Rahul Gandhi In Srinagar: ప్రతిపక్షాల మధ్య విభేదాలున్నా, ఆరెస్సెస్- బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతాం: రాహుల్ గాంధీ