Vijayashanthi: అటుకులు బుక్కి ఉద్యమం చేస్తే ఇన్ని ఆస్తులు ఎట్ల వచ్చినయ్: విజయశాంతి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏడేళ్లలో ఇంత దిగజారిపోతే... సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రం వేల కోట్ల రూపాయల ఆస్తులకు ఎదిగిపోయిందని ఆరోపించారు. విజయశాంతి మంగళవారం ట్విటర్, ఫేస్ బుక్ వేదికగా స్పందించారు.
రాష్ట్ర బడ్జెట్‌లో సగం డబ్బులు అప్పులు, మిత్తిలకే (వడ్డీలు) సరిపోతోందని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. ఆ మిత్తీలు కట్టేందుకు కూడా మళ్ళీ అప్పులు తేవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏడేళ్లలో ఇంత దిగజారిపోతే... సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రం వేల కోట్ల రూపాయల ఆస్తులకు ఎదిగిపోయిందని ఆరోపించారు. విజయశాంతి మంగళవారం ట్విటర్, ఫేస్ బుక్ వేదికగా స్పందించారు.
‘‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే మన ఉద్యోగాలు మనకు, మన నీళ్లు మనకు, మన నిధులు మనకొస్తాయని ఆశపడిన తెలంగాణ ప్రజలకు నేడు నిరాశ, అప్పులే మిగిలాయి. ఏడేండ్ల కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబ ఆస్తులు, భూములు పెరిగినై తప్ప, అసలు భూములే లేని దళితులకు ఎకరం భూమి దక్కలే. 2004లో కేసీఆర్ కుటుంబం ఆస్తుల విలువ 85 లక్షల ఉంటే... 2018 నాటికి 100కోట్ల రూపాయలకు చేరింది. ఇవన్నీ వారికి వారుగా ఎన్నికల సంఘానికి సమర్పించుకున్న లెక్కలు మాత్రమే. ఇక కనిపించని ఆస్తుల లెక్కలు వేల కోట్లలోనే ఉంటాయనేది అందరికీ తెలిసిన సత్యమే. 16 వేల కోట్ల మిగులు రెవెన్యూ ఏర్పడిన రాష్ట్రంలో గడిచిన 7 ఏడేళ్ల కేసీఆర్ పాలనలో ఏకంగా 4 లక్షల కోట్ల అప్పులు మిగిలాయి. కాగా, తెచ్చిన అప్పులకు కట్టిన మిత్తే 92 వేల కోట్లయితే... కట్టాల్సిన కిస్తీల పైకం ఇంకో 33 వేల కోట్లుగా ఉంది.
రాష్ట్ర బడ్జెట్‌లో సగం అప్పులు, మిత్తిలకే సరిపోతోంది. అయితే మిత్తీలు కట్టేందుకు కూడా మళ్ళీ అప్పులు తేవాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన్రు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏడేళ్లలో ఇంత దిగజారిపోతే... సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రం వేల కోట్ల రూపాయల ఆస్తులకు ఎదిగిపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ పదే పదే చెప్పేమాట.. అటుకులు బుక్కి ఉద్యమం చేసినం... అని. నిజంగా అటుకులు బుక్కి ఉద్యమం చేస్తే ఇన్ని ఆస్తులు ఎట్ల పెరిగినయ్? ఉద్యమంలో పాల్గొన్న సగటు తెలంగాణ పౌరుడికి అప్పులు ఎందుకు మిగిలినయ్? ఉద్యమం మాటున కేసీఆర్ ఆస్తులు పెంచుకున్నడు తప్ప ఇంకేమైనా ఉందా? ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం ఆస్తులు ధారపోసి కొట్లాడిన అనేక మంది ఉద్యమకారులకు దక్కింది ఏంటి?’’
ఉద్యమం మాటున ఫాంహౌజ్ భూములు పెంచుకున్న కేసీఆర్.. ఏదో ఒక రోజు ఈ లెక్కలు బయటికి రాకతప్పదని గ్రహించి, 2006లోనే ఒక సమాధానాన్ని కనిపెట్టాడు అదే.. ఎకరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నాననే దివ్యమంగళ మంత్రం. అక్రమ సంపాదనను వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంగా చూపి తప్పించుకునే ప్రయత్నం 2006 నుండే మొదలు పెట్టిండు. కానీ, ఎప్పటికైనా ఆయన చేసిన అక్రమార్జన బట్టబయలు చేసి తెలంగాణ సమాజానికి పంచక తప్పదు.’’ అని విజయశాంతి విమర్శించారు.
Also Read: TRS MPs : పార్లమెంట్ శీతాకాల సమావేశాల బహిష్కరణ.. టీఆర్ఎస్ అధికారిక ప్రకటన !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి