News
News
X

Telangana Cabinet : 11న తెలంగాణ కేబినెట్ భేటీ - కీలక నిర్ణయం తీసుకునే చాన్స్ !

పదకొండో తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. మునుగోడు ఉపఎన్ని ఖాయమైన సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది.

FOLLOW US: 

Telangana Cabinet :  తెలంగాణ మంత్రివర్గ సమావేశం పదకొండో తేదీన జరగనుంది. ప్రగతి భవన్‌లో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత కేబినెట్ భేటీ జరుగుతోంది. ఉపఎన్నికలు ఖాయం కావడంతో ఎలాంటి వ్యూహం అవలంభించాలన్నదానిపై చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉంది. ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేకపోతున్నారు. అప్పులపై కేంద్రం కఠినమైన పరిమితి విధించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నాయ వనరుసపై కేబినెట్ చర్చించనుంది. 

తెలంగాణ అప్పులపై కేంద్రం పరిమితి 

తెలంగాణ సర్కార్ ఈ ఏడాది దాదాపు రూ.54వేల కోట్ల అప్పు తీసుకుంటామని బడ్జెట్​లో ప్రభుత్వం భావించినప్పటికీ.. కేంద్రం ఆ మేరకు అనుమతి ఇవ్వలేదు  రూ.35వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకునేందుకు అవకాశం కల్పించారు.  ఇవి కాకుండా గ్యారంటీల పేరుతో తీసుకునే అప్పులు కూడా పరిమితుల మేరకే లభించనున్నాయి.  గత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.47,500 కోట్ల అప్పు తీసుకుంది.  గ్యారంటీ అప్పులను ఇష్టమొచ్చినట్లు తెచ్చుకునే వీల్లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అందులో భాగంగానే  గ్యారంటీ అప్పులపై అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ ఇటీవల లెటర్​ కూడా రాసింది. దీంతో రాష్ట్ర సర్కార్​ గ్యారంటీ అప్పులపై కూడా ఆశలు వదులుకుంది. 

బీజేపీలోకి సినీ నటి జయసుధ, జోరుగా ప్రచారం!

గతంలో ఎక్కువ తీసుకోవడంతో ఈ ఏడాది పరిమితి

పోయిన ఆర్థిక సంవత్సరం వరకు రాష్ట్ర సర్కార్ గ్యారంటీల పేరుతో తెచ్చే అప్పులను లెక్కలో చూపట్లేదు. ఇదంతా ఎఫ్​ఆర్​బీఎం పరిధిలోకి రాకుండా జాగ్రత్త పడుతోంది. ఆ అప్పుల కిస్తీలు మాత్రం బడ్జెట్​లో నుంచి కడుతూ వస్తోంది. ఇప్పుడు ఇలా కట్టినవన్నీ ఎఫ్​ఆర్​బీఎం (ఆర్​బీఐ) అప్పుల కింద లెక్కిస్తామని చెప్పింది. ఇదిలా ఉంటే 2023 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు మొత్తం రూ.3.44 లక్షల కోట్లకు చేరుతుందని మార్చిలో పెట్టిన బడ్జెట్​లోనే ప్రభుత్వం వెల్లడించింది. కానీ బడ్జెట్​తో సంబంధం లేకుండా ఇరిగేషన్​ ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ, ఇతర కార్పొరేషన్ల పేరిట ఇప్పటికే తెచ్చిన రుణాలు రూ.1,35,282 కోట్లు ఉన్నాయి. వీటిని ప్రభుత్వం ష్యూరిటీపై తెచ్చింది. మొత్తంగా ప్రభుత్వం తెచ్చిన అప్పుల మొత్తం రూ.4.50 లక్షల కోట్లు దాటుతోంది. అందుకే కేంద్రం అప్పుల విషయంలో పరిమితి విధించింది. 

నాడు ఉపఎన్నికలే బ్రహ్మాస్త్రం - నేడు వాటితోనే గండం ! టీఆర్ఎస్‌కు టెన్షన్ !

మునుగోడు ఉపఎన్నికపై చర్చించే అవకాశం 

వీటన్నింటినీ చర్చించడంతో పాటు రాజకీయ పరిణామాలపైనా కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. మునుగోడు ఉపఎన్నికను ఎలా ఎదుర్కోవాలన్నది కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ఉపఎన్నికల రచ్చ ఎందుకు.. ముందస్తుగా ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

Published at : 09 Aug 2022 05:55 PM (IST) Tags: cm kcr Telangana Cabinet Telangana Cabinet Meeting Munugodu By-Election

సంబంధిత కథనాలు

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

చైన్‌ లాగుతూ దొరికిన కానిస్టేబుల్- స్థానికులు బాదుడే బాదుడు!

చైన్‌ లాగుతూ దొరికిన కానిస్టేబుల్- స్థానికులు బాదుడే బాదుడు!

Breaking News Live Telugu Updates: తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

Breaking News Live Telugu Updates: తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

Priyanka Batukamma : బతుకమ్మతో ఇందిరాగాంధీ - ప్రియాంకా గాంధీ తెలుగు ఏం చెప్పారంటే ?

Priyanka Batukamma :  బతుకమ్మతో ఇందిరాగాంధీ - ప్రియాంకా గాంధీ తెలుగు ఏం చెప్పారంటే ?

గురువుగారూ అంటూ గుండెల్లో గునపం దింపారు- స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడుల కోసం కిల్లర్ ప్లాన్

గురువుగారూ అంటూ గుండెల్లో గునపం దింపారు- స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడుల కోసం కిల్లర్ ప్లాన్

టాప్ స్టోరీస్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..! | ABP Desam

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..!  | ABP Desam

Arvind Swamy: చైతు సినిమాలో అరవింద్ స్వామి - విలన్‌గా మెప్పిస్తారా?

Arvind Swamy: చైతు సినిమాలో అరవింద్ స్వామి - విలన్‌గా మెప్పిస్తారా?