Sajjanar: బస్సెక్కిన ఆర్టీసీ బాస్... కుటుంబ సమేతంగా స్టెప్పులు.. నెట్టింట వీడియో వైరల్
ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు సంస్థ ఎండీ సజ్జనార్ వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. తరచూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ప్రమోట్ చేస్తున్నారు.
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇప్పుడు ఏంచేసినా వైరల్ అవుతుంది. ఆర్టీసీ లాభాల బాటలో నడిపించేందుకు ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ బస్టాండ్ లో యూపీఐ సేవలు, కల్లాల వద్దకే కార్గో సేవలు ఇలా సంస్కరణలతో ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సజ్జనార్... ఆర్టీసీలో ప్రయాణాన్ని ప్రమోట్ చేస్తున్నారు. మళ్లీ ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈసారి ఒక్కరే కాకుండా కుటుంబ సమేతంగా ప్రయాణించి... ఉల్లసంగా, ఉత్సాహంగా స్టెప్పులేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.
.@tsrtcmdoffice VC Sajjanar కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు మరియు సపరివార సమేతంగా బస్సులో ప్రయాణం చేసి @TSRTCHQ బస్సులో ప్రయాణం సురక్షితం,సుఖమయం మరియు శుభప్రదం అని ప్రయాణికులకు భరోసా కల్పిస్తున్న వైనం.
— Abhinay Deshpande (@iAbhinayD) November 29, 2021
It's Family Time Huhuhu, hooch! #Hyderabad #IchooseTSRTC pic.twitter.com/wZYigHFRZC
Also Read: యాసంగిలో ధాన్యం సేకరణ ఉండదు... వర్షకాలం పంటను ఎంతైనా కొంటాం... సీఎం కేసీఆర్ కీలక ప్రకటన...
సజ్జనార్ పై నెటిజన్ల ప్రశంసలు
ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ఎండీ సజ్జనార్ కీలక మార్పులు తీసుకువస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు ఆర్టీసీలో ప్రయాణిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా ఆర్టీసీని ప్రమోట్ చేసేందుకు ఎండీ సజ్జనార్ తన ఫ్యామిలీతో కలిసి బస్సులో ప్రయాణిస్తూ ఓ వీడియో చేశారు. ఈ వీడియోలో సజ్జనార్ కుటుంబ సభ్యులు ఆనందంగా స్టెప్పులేశారు. ఆర్టీసీ బస్సు సురక్షితమని తెలియజేసేలా సజ్జనార్ సందేశాన్నిచ్చారు. ఆర్టీసీ సంస్థను లాభాల బాట పట్టించేందుకు సజ్జనార్ చేస్తున్న పనులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వినూత్న ప్రయోగాలతో ఆర్టీసీ ప్రమోషన్స్
పోలీస్ శాఖలో ఉన్నప్పుడు తన మార్క్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్.. ఆర్టీసీ ఎండీగానూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్టీసీని ప్రయాణికులకు మరింత చేరువ చేసేందుకు వినూత్న ప్రయోగాలతో సజ్జనార్ తన మార్క్‌ను చూపిస్తున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ప్రజల్ని ఆకర్షించే పనిలో ఉన్నారు సజ్జనార్. తరచూ వార్తల్లో నిలుస్తూ ఆర్టీసీ ప్రమోట్ చేస్తున్నారు. ఓ సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికుల సమస్యల్ని తెలుసుకుంటున్నారు. తాజాగా తన కుటుంబ సభ్యులు, బంధులతో కలిసి బస్సులో సందడి చేశారు. టీఎస్ ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, సుఖమయం, శుభప్రదం అని ప్రయాణికులకు వివరించేలా వీడియో చేశారు.
Also Read:థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు రెడీ.. పడకలు సిద్ధం, ఒమిక్రాన్ ఆందోళన వేళ మంత్రి హరీశ్ సమీక్ష