Sajjanar: చక్రాలపై మన భవిష్యత్ భద్రంగా ఉంది.. బస్సులో హోం వర్క్ చేస్తున్న విద్యార్థి వీడియో ట్వీట్ చేసిన సజ్జనార్
మన భవిష్యత్ చక్రాలపై భద్రంగా ఉందనే వ్యాఖ్యను జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విటర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అది వైరల్ అవుతోంది. ఆర్టీసీ బస్సులో ఓ విద్యార్థి పాఠశాలకు వెళుతూ తన హోం వర్క్‌ను పూర్తి చేసుకుంటున్నాడు. ఆ వీడియోను సజ్జనార్ ట్వీట్ చేశారు. 'మన భవిష్యత్' చక్రాలపై భద్రంగా ఉందని రాసుకొచ్చారు. విద్యార్థి కమిట్ మెంట్‌ను చూస్తుంటే ముచ్చటేస్తుందని చెప్పారు. విద్యార్థి అంకితభావానికి సెల్యూట్ అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు.
Our future is safe on the wheels!
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) November 28, 2021
This was seen doing his homework in #TSRTC bus. We salutes for his dedication & commitment.
DM such #memorable moments#FutureOnWheelsInTSRTC #IchooseTSRTC #sundayvibes #weekendvibes @TSRTCHQ @KTRTRS @Govardhan_MLA @puvvada_ajay@SabithaindraTRS pic.twitter.com/8MnCn2Sfym
ఆర్టీసీ ఎండీగా నియమితులైనప్పటి నుంచి.. సంస్థను లాభాల బాట పట్టించేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు సజ్జనార్. తనదైన నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు.. సంస్థను లాభాల్లో నడిపించేదుకు చర్యలు తీసుకుంటున్నారు. సజ్జనార్ నిర్ణయాలతో సంస్థ ఉద్యోగుల్లోనూ ఉత్తేజం వస్తుంది.
బస్టాండ్ లలో వివిద సేవలకు డబ్బులను యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపుల సేవలను ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లోని టికెట్ రిజర్వేషన్ కౌంటర్, పార్శిల్-కార్గో కేంద్రం, సికింద్రాబాద్‌లోని రేతిఫైల్ బస్‌పాస్ కౌంటర్లలో యూపీఐ, క్యూఆర్ కోడ్ సేవలు పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యాయి. ఈ సేవలను ప్రారంభమైన టైమ్ లో ప్రయాణికుల నుంచి అభిప్రాయలు అడిగారు సజ్జనార్. యూపీఐ టెల్లింపులపై అభిప్రాయాలు, సూచనలు ట్విట్టర్ ద్వారా తెలియజేయాలని కోరారు. దీనిపై ప్రయాణికుల నుంచి సానుకూల స్పందన వచ్చింది.
రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం చిడేడు గ్రామానికి చెందిన వైష్ణవి ఎనిమిదో తరగతి చదువుతుంది. తాను స్కూల్ కు వెళ్లాలంటే ఇబ్బంది అవుతుందని.. పాఠశాలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులు సరిగ్గా నడపడం లేదనే విషయాన్ని సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ దృష్టికి తీసుకెళ్లింది. అయితే ఈ విషయంపై భారత ప్రధాన న్యాయమూర్తి స్పందించారు. ఆ విషయాన్ని టీఎస్ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. వెంటనే చర్యలు తీసుకున్నారు. తక్షణమే పునరుద్ధరించినట్లు వెల్లడించారు. బస్సుల పునరుద్ధరణపై అప్రమత్తం చేసినందుకు సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణకు సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలా తనదైన మార్క్ నిర్ణయాలతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ముుందుకు వెళ్తున్నారు.
Also Read: Revanth Reddy: వేదికపై పాదాభివందనం చేసిన రేవంత్ రెడ్డి.. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా?