(Source: ECI/ABP News/ABP Majha)
Kamareddy News: కామారెడ్డిలో విషాదం.. గుండెపోటుతో డాక్టర్, ఆపై ట్రీట్మెంట్ కోసం వచ్చిన పేషెంట్ మృతి..
సాధారణంగా పేషెంట్లకు డాక్టర్లు ప్రాణం పోస్తారు. ఎంత కష్టమైనా సరే తన వద్దకు వచ్చిన వారి ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు. కామారెడ్డి జిల్లాలో డాక్టర్, పేషెంట్ చనిపోవడం విషాదాన్ని నింపింది.
కొన్ని ఘటనలు విషాదాన్ని మించి అనిపిస్తాయి. సాధారణంగా పేషెంట్లకు డాక్టర్లు ప్రాణం పోస్తారు. ఎంత కష్టమైనా సరే తన వద్దకు వచ్చిన వారి ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు. కానీ తాజాగా జరిగిన ఘటన వివరాలు చదివితే మనసుకు మరింత బాధ కలుగుతుంది. కామారెడ్డి జిల్లాలో డాక్టర్, పేషెంట్ చనిపోయిన ఘటన వివరాలిలా ఉన్నాయి..
లక్ష్మణ్ కామారెడ్డి జిల్లాలో వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. గాంధారి మండలం గుజ్జల్ తండాకు చెందిన ఓ వ్యక్తికి ఛాతీలో నొప్పి రావడంతో అతడి కుటుంబసభ్యులు ఆయనను ఎస్వీ రాజా మల్లి స్పెషలిస్ట్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ లక్ష్మణ్ ఆ పేషెంట్‌కు చికిత్స అందిస్తున్నారు. అంతలోనే డాక్టర్ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స అందిస్తుండగానే డాక్టర్ లక్ష్మణ్ ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. మొదటగా డాక్టర్ అక్కడికక్కడే మరణించారు. ఆపై ఛాతీలో నొప్పితో నర్సింగ్ హోమ్‌కు వచ్చిన పేషెంట్ ను కామారెడ్డికి తరలిస్తుండగా పేషెంట్ సైతం చనిపోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read: Kondapur: సెప్టిక్ ట్యాంకులోకి దిగిన కూలీలు.. లోపలే ఇద్దరు దుర్మరణం, కారణం ఏంటంటే..
స్పెషలిస్ట్ ఆసుపత్రిలో ఓ పేషెంట్ కు చికిత్స అందిస్తుండగా డాక్టర్ లక్ష్మణ్ ఒత్తిడికి గురయ్యారు. ఛాతీలో నొప్పి వచ్చిన పేషెంట్ కు చికిత్స చేస్తుండగా ఆయనకు సైతం ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయారని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. కొంత సమయానికి డాక్టర్ గుండెపోటుతో చనిపోవడం చాలా బాధగా ఉందన్నారు. ఒత్తికి గురికావడం వల్లే విషాదం చోటుచేసుకుందని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా మాత్రమే జరుగుతాయి.
ఛాతీలో నొప్పి వచ్చిన పేషెంట్ ఆరోగ్యాన్ని పరీక్షించిన డాక్టర్ ఒత్తిడికి లోనయ్యారని మరో సిబ్బంది చెప్పారు. చికిత్స చేసే వ్యక్తికి సైతం గుండెపోటు రావడంతో ఆయనతో పాటు పేషెంట్ సైతం ప్రాణాలు కోల్పోయారు. దీంతో పేషెంట్, డాక్టర్ కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఘటనపై మరికొందరు విచారం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ ఛాతీలో నొప్పి రాకపోయి ఉంటే రెండు ప్రాణాలు దక్కేవని.. కానీ కాలం కలిసిరాలేదని స్థానికులు చెబుతున్నారు.
Also Read: Adilabad: హాస్టల్‌లో భూతం! ఒంటిపై రక్కుతూ, వింత అరుపులు.. అసలేం జరిగిందంటే..
Also Read: Hyderabd: 44 మంది యువకులు, ఇద్దరు హిజ్రాలు.. అంతా హోమో సెక్సువల్స్! రేవ్ పార్టీ భగ్నం
Also Read: Poor States : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్