అన్వేషించండి

Telangana Schools: సెలవుల్లోపు విద్యార్థులకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి... పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయండి... మంత్రి సత్యవతి రాథోడ్

పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు. విద్యార్థులకు వ్యాక్సిన్ పూర్తి చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలో ఒమిక్రాన్, కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8 నుంచి 16 వరకూ సెలవులు ప్రకటించింది. సూళ్లలో కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలోని విద్యార్థుల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులు ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే వారిని వైద్య సదుపాయం అందించాలని, తగిన పరీక్షలు చేయించాలని చెప్పారు. మహబూబాబాద్, కురవిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో కరోనా సోకిన ముగ్గురు విద్యార్థులకు వైద్యం అందించాలని, ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.

Also Read:  ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. థర్డ్ వేవ్ వైపు పయనిస్తున్నామా?

ప్రతి విద్యార్థికి టీకా వేయించుకోవాలి

ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించిందని మంత్రి రాథోడ్ తెలిపారు. 8వ తేదీలోపు 15 నుంచి 18 ఏళ్ల లోపు విద్యార్థులకు వ్యాక్సిన్ వేయించాలని ఆమె సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలను, వసతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది బాధ్యత తీసుకుని ప్రతి విద్యార్థి టీకా వేయించుకునేలా చూడాలన్నారు. రోజువారి లక్ష్యాలు పెట్టుకుని విద్యార్థులకు టీకాలు వేయించే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఒమిక్రాన్, కోవిడ్ బారిన పడకుండా పరిరక్షించాలన్నారు. 

8 నుంచి 16 వరకు సెలవులు

తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 8 నుంచి 16 వరకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వైద్యారోగ్యశాఖపై సోమవారం సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు,  ఉన్నతాధికారులతో కేసీఆర్ సమావేశమై.. కరోనా పరిస్థితులపై చర్చించారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తి తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో లాక్ డౌన్ గురించి అధికారులు సీఎం కేసీఆర్ కు వివరించారు. లాక్ డౌన్ అక్కర్లేదని అధికారులు చెప్పారని సీఎం అన్నారు. కరోనా దృష్ట్యా ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆస్పత్రుల్లో పడకలు, పరీక్ష కిట్లు, మందులు సమకూర్చుకోవాలని చెప్పారు. బస్తీ దవాఖానాలపై ఏర్పాటుపైనా.. పరిశీలించాలని కేసీఆర్ ఆదేశించారు. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని.. మాస్కులు తప్పకుండా ధరించాలని సీఎం అన్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా సీఎం కేసీఆర్ కు అధికారులు నివేదిక ఇచ్చారు. గుంపులుగా ఉండరాదని నివేదికలో పేర్కొన్నారు. బహిరంగ సభలు, ర్యాలీలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read:  విజయనగరం జిల్లాలో కరోనా కలకలం... కొత్తవలస పాఠశాలలో 19 మంది విద్యార్థులు, ఒక టీచర్ కు పాజిటివ్

Also Read: ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేస్తాను... అరెస్టు చేస్తే అప్పుడు చూద్దాం... హైదరాబాద్ లో జేపీ నడ్డా కామెంట్స్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget