By: ABP Desam | Updated at : 04 Jan 2022 07:18 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
జేపీ నడ్డా
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్ గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. బండి సంజయ్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా బీజేపీ ర్యాలీని రద్దు చేసింది. బండి సంజయ్ అన్యాయంగా అరెస్టు చేశారని బీజేపీ నేత తరుణ్ చుగ్ అన్నారు. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ నిరసన కార్యక్రమం చేపట్టింది.
అంతకు ముందు ఏం జరిగింది?
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌లోని సికింద్రబాద్ గాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ వరకు క్యాండిల్ ర్యాలీని బీజేపీ చేపట్టాలని నిర్ణయించింది. ఈ ర్యాలీలో పాల్గోనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ వచ్చారు. జేపీ నడ్డాకు జాయింట్ సీపీ కార్తికేయ ఎయిర్ పోర్టులోనే కోవిడ్ నిబంధనల గురించి వివరించారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. అందుకు జేపీ నడ్డా స్పందిస్తూ బాధ్యత గల పౌరుడిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తానని చెప్పారు. జేపీ నడ్డా ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పారని నడ్డా అన్నారు. కరోనా నిబంధనలు ఉన్నాయని తెలిపారు. తాను అన్ని కరోనా నిబంధనలు పాటిస్తానని వారికి చెప్పానని పేర్కొన్నారు. సికింద్రబాద్ లోని గాంధీ విగ్రహానికి నివాళుల అర్పిస్తాన్నారు. అరెస్టు చేస్తే అప్పుడు చూద్దాం అంటూ ఆయన సికింద్రాబాద్ బయలుదేరాయి. ఆయన వెంట బీజేపీ శ్రేణులు కూడా భారీగా తరలివెళ్తున్నారు.
Also Read: ఓ వైపు బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతుంటే.. ఎగ్జిబిషన్ కావాలా?
ర్యాలీకి సిద్ధమైన బీజేపీ... భారీగా పోలీసుల మోహరింపు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని బీజేపీ శ్రేణులు నిర్ణయించాయి. దీంతో భారీగా బీజేపీ శ్రేణులు తరలివచ్చాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టులో జేపీ నడ్డాను కలిసిన పోలీసులు కోవిడ్ నిబంధనల వల్ల రాజకీయ కార్యక్రమాలకు అనుమతి లేదని వివరించారు. నిరసన ప్రదర్శన వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. జనవరి 10 వరకు ర్యాలీలు, సభలకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చిన జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. కరోనా నిబంధనలు అమల్లో ఉన్నాయన్నాయని వివరించారు. అన్ని కరోనా నిబంధనలు పాటిస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే నోటీసులు ఇవ్వొచ్చని తెలిపారు. సికింద్రాబాద్ గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తానన్నారు. తన ప్రజాస్వామ్య హక్కులను ఎవరూ హరించలేరని జేపీ నడ్డా స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన జేపీ నడ్డా సికింద్రాబాద్ పయనమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, రాజాసింగ్, సీనియర్ నేత లక్ష్మణ్, జితేందర్‌రెడ్డి జేపీ నడ్డా వెంట ఉన్నారు. మరో వైపు బీజేపీ శ్రేణులు భారీగా సికింద్రాబాద్ చేరుకున్నారు. నల్ల జెండాలు, నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్యారడైజ్ కూడలి నుంచి ఎంజీ రోడ్డు వరకు పోలీసులు భారీగా మోహరించారు.
Also Read: తెలంగాణ హైకోర్టులో కొవిడ్, ఒమిక్రాన్‌పై విచారణ.. నివేదిక సమర్పించిన డీజీపీ, డీహెచ్
బీజేపీ నేతలతో భేటీ
శంషాబాద్ కు చేరుకున్న జేపీ నడ్డాకు ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సీనియర్ నేతలు లక్ష్మణ్, రాజాసింగ్, విజయశాంతి, బంగారు శృతి జేపీ నడ్డాకు స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్, లక్ష్మణ్,, జితేందర్‌రెడ్డి, డీకే అరుణ, విజయశాంతి, రాంచంద్రరరావు, ప్రేమేందర్‌రెడ్డిలో ఆయన సమావేశమయ్యారు. బండి సంజయ్ అరెస్టు, అనంతర పరిణామాలను బీజేపీ నేతలు నడ్డాకు వివరించారు.
Also Read: మీ-సేవ నుంచి ఈడ్చుకొచ్చి పట్టపగలే యువతి హత్య.. మూడేళ్లకు కోర్టు సంచలన తీర్పు, సర్వత్రా హర్షం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Karimnagar News : కస్తూర్బా స్కూల్స్ లో ఉద్యోగాలని నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్, లక్షల్లో మోసపోయిన నిరుద్యోగులు
TRS Leaders On Modi: తెలంగాణ నేలపై కమలం వికసించే ఛాన్స్ లేదు- మోదీ కామెంట్స్‌కు టీఆర్ఎస్ కౌంటర్
Breaking News Live Updates: కేంద్రం నిధులు ఇవ్వడంలేదు, ప్రధాని మోదీ ముందే తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు
KTR In Davos: తెలంగాణలో హ్యుండాయ్ భారీ పెట్టుబడి- దేశాభివృద్ధికి త్రి ఐ చాలా అవసరమన్న కేటీఆర్
Hyderabad News : సరూర్ నగర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసు, వెలుగులోకి సంచలన విషయాలు
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్‌లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!
MK Stalin With PM : తమిళాన్ని అధికార భాషగా గుర్తించాలి - మోదీని స్టేజ్‌పైనే అడిగిన స్టాలిన్ !
PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం