Telangana High Court: ఓ వైపు బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతుంటే.. ఎగ్జిబిషన్ కావాలా?
నుమాయిష్ ఎగ్జిబిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే విచారణ సందర్భంగా హైకోర్టు కీలక కామెంట్స్ చేసింది.
కరోనా పరిస్థితుల్లో నుమాయిష్ ఎగ్జిబిషన్ అవసరమా అని కొంతమంది ప్రశ్నించారు. కమిటీ సభ్యుల ఒత్తిడితో ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే 2019 నుమాయిష్ ఎగ్జిబిషన్ లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కీలక కామెంట్స్ చేసింది. బయటకు వచ్చేందుకే.. ప్రజలు భయపడుతుంటే.. ఎగ్జిబిషన్ అవసరమా అని ప్రశ్నించింది. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలని తెలిపింది.
2019 నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో అగ్నిప్రమాదంపై హైకోర్టు విచారణ చేసింది. అయితే అప్పటి ఘటనను దృష్టిలో పెట్టుకుని ఎగ్జిబిషన్ నిర్వహణకు ఫైర్, జీహెచ్ఎంసీ అనుమతి తీసుకోవాలని జీవో ఇచ్చామని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. 2019 అగ్నిప్రమాదంపై విచారణ ముగించినట్టు చెప్పింది. అనుమతులపై ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
ప్రస్తుతం.. ఎగ్జిబిషన్ నిలిపివేయడంపై సొసైటీ అభ్యంతరం వ్యక్తం చేసి.., ఎగ్జిబిషన్ నిలిపివేయడం సరికాదని సొసైటీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. బయట థియేటర్లు, మాల్స్ కు జనాలు వెళ్తున్నారని.. వాటికి లేని ఆంక్షలు ఎగ్జిబిషన్‌కు ఎలా విధిస్తారంటూ వాదనలు వినిపించారు.
సోసైటీ వాదనలపై హైకోర్టు.. ఘాటుగా స్పందించింది. ఓ వైపు.. కరోనా, ఒమిక్రాన్ వంటి పరిస్థితుల్లో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారని..., ఈ సమయంలో ఎగ్జిబిషన్ కావాలా? అంటూ ప్రశ్నించింది. ఎగ్జిబిషన్ నిర్వహణపై ప్రభుత్వమే.. నిర్ణయం తీసుకుంటుందని.. అభిప్రాయపడింది. కరోనా పరిస్థితుల్లో.. ఎగ్జిబిషన్ పై.. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేసింది.
Also Read: TS High Court: తెలంగాణ హైకోర్టులో కొవిడ్, ఒమిక్రాన్‌పై విచారణ.. నివేదిక సమర్పించిన డీజీపీ, డీహెచ్
Also Read: Telangana BJP: జేపీ నడ్డాకు హైదరాబాద్ పోలీసుల షాక్.. బండి సంజయ్ సీన్ రిపీట్ అవుతుందా?
Also Read: Madhu Yaskhi: కేటీఆర్.. ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపి, నిజాం షుగర్ ఫ్యాక్టర్ తెరవండి: మధుయాష్కీ గౌడ్
Also Read: Sharmila : ఏపీలో షర్మిల రాజకీయ పార్టీ ఖాయమా ? ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు ?
Also Read: Kottagudem: దంపతుల సజీవదహనంతో సంబంధం లేదు... వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే కుమారుడు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి