By: ABP Desam | Updated at : 04 Jan 2022 03:12 PM (IST)
మధుయాష్కీ గౌడ్ (File Photo)
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నా ప్రజలకు ప్రయోజనాలు అందడం లేదని, కేవలం సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రమే ఆర్థికంగా ఎదుగుతోందని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. సీసీఐ సంగతి సరే సరి.. అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందని సరిపెడుతున్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేతుల్లోనే ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి మంత్రి కేటీఆర్ ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేసుకుంటామని స్వయంగా మంత్రి కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత ఇక్కడ ప్రచారం చేస్తుండగా మాటిచ్చారని మధుయాష్కీ గుర్తుచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో కవిత ప్రచారం చేస్తూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేవలం వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరినీ ప్రభుత్వ పరం చేసుకుంటామని హామీ ఇచ్చారని.. అయితే ఇన్నేళ్లయినా ఎందుకు హామీ ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలన్నారు.
ఆసియాలో అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ.. కానీ!
దాదాపు 16 వేల ఎకరాల్లో ఏర్పడిన బోధన షుగర్ ఫ్యాక్టరి ఆసియాలోనే అతిపెద్దదని తెలిసిందే. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడాది తిరగకుండానే ఫ్యాక్టరీ మూతబడి ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. మరోవైపు షుగర్ ఫ్యాక్టరీకి చెందిన వేలాది ఎకరాల స్థలం కబ్జాకు గురవుతున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్‌కు చెందిన నేతలే ఫ్యాక్టరీ భూములును కబ్జా చేస్తున్నారనే ఆరోపణలున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని మధుయాష్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్‌వి ఉత్తర కుమార ప్రగల్భాలు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏనాడూ నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతడపడలేదని.. దీని ద్వారా స్థానికులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని ప్రభుత్వానికి సూచించారు. రైతులకు దీని ప్రయోజనం కలుగుతుందని.. మంత్రి కేటీఆర్ ఇప్పటికైనా ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపి షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేశారు. పేదలకు, రైతులకు, నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత టీఆర్ఎస్ నేతలపై ఉందన్నారు.
Also Read: KCR On School Holidays: తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు.. లాక్‌డౌన్‌పై క్లారిటీ
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Rajya Sabha Nominations: రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్‌రావు, పార్థసారధి నామినేషన్ దాఖలు
AP Telangana Breaking News Live: ఎమ్మెల్సీ అనంతబాబుకు వైఎస్సార్సీపీ షాక్, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
Karimnagar: ముగిసిన కరీంనగర్ ఇరిగేషన్ బిల్డింగ్ అధ్యాయం - బ్రిటీష్ హయాం నుంచి ఎన్నో ప్రాజెక్టులకు ఇక్కడే బీజం
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!