By: ABP Desam | Updated at : 03 Jan 2022 08:47 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మంత్రి ధర్మాన కృష్ణదాస్(ఫైల్ ఫొటో)(Source: I&PR AP)
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నిత్యం కుట్రలు కుతంత్రాలు చేస్తుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. ఏనాడూ సింగిల్ గా ఎన్నికలు వెళ్లి గెలిచిన చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు. మామకు వెన్నుపొటు పొడిచి ఓసారి, వాజిపేయ్ మొహాంతో మరోసారి, మోదీ పేస్ తో ఇంకొసారి బాబు గెలిచారని ఆరోపించారు. మహిళల సహాకారంతో మళ్లీ అధికారంలోకి వస్తామని ధర్మాన ధీమా వ్యక్తం చేశారు.
జగన్ మళ్లీ అధికారం చేపట్టకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఒక్కరే నాయకుడు.. అది జగన్ మాత్రమే అని మంత్రి ధర్మాన అన్నారు. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో అత్యధిక మేజార్టీలతో గెలుపొందామని తెలిపారు.
వైసీపీలో ఒక్కరే లీడర్ అది జగన్
రాష్ట్రంలో టీడీపీ లేదని, అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సీఎం జగన్ ను రక్షించుకునేందుకు ప్రాణం ఇచ్చే నాయకులు ఉన్నారన్నారు. ప్రజలకు అభివృద్ది చేస్తుంటే టీడీపీ నేతలకు వచ్చిన ఇబ్బందేంటని ఆయన ప్రశ్నించారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు వైసీపీ ప్రభుత్వం కృషిచేస్తుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వైసీపీలో లీడర్ ఒక్కరే అది జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందన్నారు. రెవెన్యూ మంత్రిగా ముప్పై లక్షల మందికి ఇల్లు ఇచ్చే అవకాశం తనకు లభించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
Also Read: సినిమా టిక్కెట్లపై అఫిడవిట్‌కు సమయం కావాలన్న ప్రభుత్వం..., ఫిబ్రవరికి వాయిదా వేసిన హైకోర్టు !
సీఎం జగన్ సింహం
వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉందని ఇటీవల ధర్మాన అన్నారు. సీఎం జగన్ సింహం వంటి వారని, ఎంత మంది గుంపులుగా వచ్చినా సింహాన్ని ఏమీ చేయలేరని అన్నారు. ఎన్ని పార్టీలు కలిసినా సీఎం జగన్ ను ఓడించలేరన్నారు. వచ్చే ఎన్నికల కోసం పలు పార్టీలు ఇప్పటి నుంచే ఏకమయ్యేందుకు ఎత్తులు వేస్తున్నాయని ధర్మాన స్పష్టం చేశారు. అమరావతి రాజధానిని మార్చడంలేదని, వికేంద్రీకరణలో భాగంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి పాటుపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేది సీఎం జగన్ ఆలోచన అని ధర్మాన పేర్కొన్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Bhavani Island: పర్యాటక అద్బుతం విజయవాడ భవానీ ఐల్యాండ్, నది మధ్యలో ప్రకృతి అందాలు
Student Debarred: ఏపీ ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో కాపీయింగ్ - 13 మంది విద్యార్థుల్ని డిబార్ చేసిన అధికారులు
R Krishnaiah Thanks YS Jagan: ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు, కానీ వైఎస్ జగన్ ఛాన్స్ ఇచ్చారు : ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
Breaking News Live Updates: జూబ్లీహిల్స్‌లో నటుడు బాలకృష్ణ ఇంటి వద్ద రోడ్డు ప్రమాదం
Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు - వారికి మాత్రమే !
Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?
Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్