అన్వేషించండి

Vizianagaram: విజయనగరం జిల్లాలో కరోనా కలకలం... కొత్తవలస పాఠశాలలో 19 మంది విద్యార్థులు, ఒక టీచర్ కు పాజిటివ్

విజయనగరం జిల్లాలో కరోనా కలకలం రేగింది. కొత్త వలస జడ్పీ పాఠశాలలో 19 మంది విద్యార్థులు, ఒక టీచర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది.

దేశంలో ఒమిక్రాన్ భయాందోళనలు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఏపీలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో కరోనా కలకలం రేగింది. ఒకే పాఠశాలలో ఉపాధ్యాయుడితో పాటు 19 మంది విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విజయనగరం జిల్లాలోని కొత్తవలస జడ్పీ ఉన్నత పాఠశాలలో 60 మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేశారు. ఒక ఉపాధ్యాయుడు, 19 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో పాఠశాలకు రెండ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు.

Also Read: అమిత్ షాతో కుదరని భేటీ.. ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన !

కొత్త వేరియంట్ కలవరం

ఓ వైపు ఒమిక్రాన్, మరోవైపు కరోనా కేసులు ప్రపంచంపై దండయాత్ర చేస్తుంటే తాజాగా మరొక కొత్త వేరియంట్ బయటపడింది. అవును.. ఒమిక్రాన్ కంటే వేగంగా ఇది సోకుతున్నట్లు తేలింది. ఈ కొత్త మ్యుటేషన్ పేరు ఐహెచ్‌యూ (బీ.1.640.2). ఫ్రాన్స్‌లోని ఐహెచ్‌యూ మెడిటరనీ ఇన్‌ఫెకన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ కొత్త మ్యుటేషన్‌ను గుర్తించారు. ఆ సంస్థ పేరునే వేరియంట్‌కు పెట్టారు. ఒమిక్రాన్ కన్నా ఐహెచ్‌యూకు మ్యూటేషన్లు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని మార్సెయ్ అనే సిటీలో 12 కేసులను నిర్ధారించారు. వీరంతా ఆఫ్రికా కామెరూన్ నుంచి వచ్చినట్లు తేలింది. ఈ వేరియంట్ లో 46 మ్యుటేషన్లు ఉన్నట్లు.. దీంతో ఒమిక్రాన్ కన్నా వేగంగా ఇది సోకుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాక్సిన్లకు కూడా అది లొంగడం లేదని అంటున్నారు. కొత్త వేరియంట్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కొత్త వేరియంట్ వేరే దేశాల్లో లేదని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. దీనిని 'వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్' జాబితాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేర్చింది.

Also Read:  బిక్షాటన చేసే సాధువు రూ.15 లక్షల విరాళం... బ్యాంకులో సొమ్ము దాచి దైవ కార్యక్రమాలకు దానం

Also Read: మరో జీవోను వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం ...సర్పంచ్‌ల అధికారాలు సేఫ్ !

Also Read: చెత్తపన్ను కట్టకపోతే ఇంటి ముందే చెత్త పోస్తారట... వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే హెచ్చరిక !

Also Read: మంచు విష్ణు కూడా నిర్మాతే.. మోహన్ బాబు వ్యాఖ్యలపై బడా నిర్మాత షాకింగ్ కామెంట్స్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget