By: ABP Desam | Updated at : 04 Jan 2022 06:53 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 28,311 మందికి కరోనా పరీక్షలు చేశారు. 334 మందికి వైరస్ సోకింది. వైరస్ కారణంగా.. ఒకరు చనిపోయారు. కరోనా నుంచి మరో 95 మంది బాధితులు బయటపడ్డారు. ప్రస్తుతం ఏపీలో 1,516 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
#COVIDUpdates: 04/01/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 4, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,75,047 పాజిటివ్ కేసు లకు గాను
*20,59,032 మంది డిశ్చార్జ్ కాగా
*14,499 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,516#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/AwSCaxIto3
దేశంలో ఒమిక్రాన్, కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1892కు పెరిగింది. మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు ఉన్నాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 37,379 కరోనా కేసులు నమోదయ్యాయి. 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 124 మంది వైరస్‌తో మృతి చెందారు.
మహారాష్ట్రలో కొత్తగా 12,160 కరోనా కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 50 వేల మార్కు దాటింది. మొత్తం కేసుల సంఖ్య 67,12,028కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 1,41,553కు పెరిగింది.
రాష్ట్రంలో కొత్తగా 68 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 578కి పెరిగింది. కొత్తగా నమోదైన 68 కేసుల్లో 40 ముంబయిలోనే ఉన్నాయి. పుణె నగరంలో 14, నాగ్‌పుర్‌లో 4, పుణె గ్రామీణం, పన్వేల్ నగరంలో చెరో 3, కొల్హాపుర్, నవీ ముంబయి, రాయ్‌గడ్, సతారాలో ఒక్కో కేసు నమోదయ్యాయి.
రాజస్థాన్..
రాజస్థాన్‌లో కొత్తగా 550 కరోనా కేసులు నమోదుకాగా 53 మందికి ఒమిక్రాన్ సోకింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 174 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
Bharat Bandh : సీపీఎస్ రద్దు, కుల ఆధారిత జనాభా గణన డిమాండ్‌తో భారత్ బంద్
Konaseema Curfew : బుధవవారం నుంచి కోనసీమలో కర్ఫ్యూ - కీలక నిర్ణయం తీసుకున్న పోలీసులు
Konseema Protest Live Updates: కోనసీమ జిల్లా అంతటా కర్ఫ్యూ- ఆందోళనతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త
Anantapur TDP Kalva : ఏకతాటిపైకి అనంత టీడీపీ నేతలు - చంద్రబాబు టూర్ తర్వాత మారిన సీన్ !
Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !
Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరపై..!
KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్