Arvind Kejriwal Coivd Positive: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్.. టెస్టులు చేయించుకోవాలని వారికి సూచన
Delhi CM, Kejriwal Covid Positive: ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో కరోనా వైరస్ ప్రపంచంలో పలు దేశాలను వణికిస్తోంది. భారత్‌లో ఒమిక్రాన్ కేసులు 2 వేలకు చేరువలో ఉన్నాయి.
Arvind Kejriwal Coivd Positive: కరోనా వైరస్ వ్యాప్తి దేశంలో మరింతగా పెరిగిపోతోంది. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో ప్రపంచంలో పలు దేశాలను వణికిస్తోంది. భారత్‌లో ఒమిక్రాన్ కేసులు 2 వేలకు చేరువలో ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీలో అధిక సంఖ్యలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.
తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆయన కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా కొవిడ్19 పాజిటివ్ గా తేలింది. తనకు కరోనా సోకినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ సోషల్ మీడియాలో వెల్లడించారు. తనకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.
ఇటీవల తనను నేరుగా కలిసిన వారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వారు స్వయంగా ఐసోలేషన్‌కు వెళ్లడం ఉత్తమమని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సూచించారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమమత్తం చేసింది. కొవిడ్19 నిబంధనలు కఠినతరం చేయాలని, నైట్ కర్ఫ్యూ, ఆఫీసులు, థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ లాంటివి అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.
Also Read: Weather Updates: అక్కడ మరో రెండు రోజులపాటు వర్షాలు.. ఏపీ, తెలంగాణలో తగ్గిన చలి తీవ్రత