By: ABP Desam | Updated at : 04 Jan 2022 06:58 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు తగ్గింది. గ్రాముకు రూ.21 మేర తగ్గింది. వెండి ధర నేడు గ్రాముకు రూ.0.40 పైసలు తగ్గి కిలోకు రూ.400 దిగజారింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.45,250 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,360 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.66,200గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,250 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,360గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.66,200 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,250 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,360గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.66,200గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
అయితే, ఇతర నగరాల్లో మాత్రం బంగారం ధరలు నేడు పెరిగాయి. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,640గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,250 గా ఉంది.
ప్లాటినం ధర నేడు ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం నేడు రూ.5 తగ్గి.. రూ.23,020 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.
అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Amazon Deal: అమెజాన్‌లో భారీ ఆఫర్లు.. యాపిల్ ఎయిర్ పోడ్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్!
Also Read: Fake Pan Card Check: పాన్ కార్డుపై డౌటా? అసలు, నకిలీ ఇలా గుర్తించండి
Also Read: Car Sales Dec 2021: హ్యూందాయ్‌కు 'టాటా' మోటార్స్ సెగ.. డిసెంబర్లో కార్లను మామూలుగా అమ్మలేదు మరి!
Also Read: Housing sales: హైదరాబాద్ తగ్గేదే లే! మూడు రెట్లు పెరిగిన ఇళ్ల విక్రయాలు
Petrol-Diesel Price, 26 May: ఈ నగరాల్లో వారికి శుభవార్త! ఇక్కడ ఇంధన ధరలు తగ్గుముఖం, ఈ సిటీల్లో మాత్రం పైపైకి
Gold-Silver Price: వరుసగా రెండోరోజూ బంగారం ధర షాక్! పెరిగిన పసిడి, వెండి ధరలు
Cash Deposits Rules: ప్రజలకు అలర్ట్! రేపట్నుంచి మారుతున్న నగదు డిపాజిట్ రూల్స్
Cryptocurrency Prices Today: బిట్‌కాయిన్ ఓకే! ఆ రెండో కాయిన్ మాత్రం భయపెడుతోంది!
Stock Market News: సూచీల నేల చూపులు! సెన్సెక్స్ 303, నిఫ్టీ 99 డౌన్ - ఫెడ్ మినిట్స్ కోసం వెయిటింగ్!
Modi Hyderabad Tour Today: నేడే హైదరాబాద్‌కు ప్రధాని, రంగంలోకి 2 వేల మంది పోలీసులు - పూర్తి షెడ్యూల్ ఇదీ
Amalapuram Violence: అమలాపురం అల్లర్ల కేసులో కీలక వ్యక్తి అరెస్టు, అసలు ఎవరీ అన్యం సాయి?
Khammam: సీఎం జగన్‌పై తెలంగాణ మంత్రి వ్యాఖ్యల దుమారం! అదే పనిగా విమర్శలు, అందులో ఆంతర్యంటి?
Telangana CM KCR Bengaluru Tour: నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ- బెంగళూరుకు సీఎం కేసీఆర్, ముచ్చటగా మూడోసారి