By: ABP Desam | Updated at : 18 Jan 2022 10:13 PM (IST)
తెలంగాణ హైకోర్టు
కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులపై వివిధ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై.. సీజే జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. జీవో 317పై స్టే ఇవ్వాలని ఉపాధ్యాయుల తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. కొత్త జిల్లాలకు వెళ్లిన ఉద్యోగులు విధుల్లో చేరారని.., అదనపు ఏజీ బీఎస్ ప్రసాద్ కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. జీవో 317పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పిటిషనర్ల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఉపాధ్యాయుల కేటాయింపులు అనేవి.. తుది తీర్పునకు లోబడి ఉండాలని కోర్టు చెప్పింది. తదుపరి విచారణను ఏప్రిల్ 4కి వాయిదా వేసింది.
అసలు జీవో నెం.317 ఎందుకంటే ?
కొత్త జిల్లాల స్థానికతను పక్కనబెట్టి సీనియారిటీకే ప్రాధాన్యం ఇస్తూ ఉపాధ్యాయుల బదిలీలను చేయడం వివాదాస్పదం అవుతోంది. తెలంగాణలో మొత్తం వర్కింగ్టీచర్లు ఒక లక్ష తొమ్మిది వేల మంది ఉన్నారు. కాగా ఇందులో దాదాపు 22 వేల మందికి ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీలు జరిగాయి. ఎన్నో ఏండ్లుగా స్థానికంగా ఉన్నవారిని వందల కిలోమీటర్ల దూరం పంపడంతో మహిళా టీచర్లకు ఇబ్బందిగా మారింది. దీనివల్ల కుటుంబాన్ని, పిల్లలను వదిలి వెళ్లాల్సిరావడం, వృద్ధులైన కన్న తల్లిదండ్రులు, అత్తా మామలకూ దూరంగా వెళ్లాల్సి ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
ఉద్యోగసంఘాలు, రాజకీయ పార్టీల డిమాండ్లేమిటి?
ప్రస్తుతం ఈ సమస్య రాజకీయం అయింది. బదిలీల ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసి.. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి... స్థానికత ప్రాతిపదకన బదిలీలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీరికి రాజకీయ పార్టీలు మ్దదతు పలుకుతున్నాయి. పదోన్నతలు కల్పించిన అనంతరం ఏర్పడిన ఖాళీల్లో నష్టపోయిన ఉపాధ్యాయులను భర్తీ చేసి న్యాయం చేయాలని.. బ్లాక్చేసిన 13 జిల్లాల వారికి కూడా అవకాశం కల్పించాలని.. . జిల్లా స్థాయిలో జరిగిన తప్పులపై ఆయా జిల్లాల కలెక్టర్లు సరిచూసుకొని ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
Also Read: Covid Updates: తెలంగాణలో కొత్తగా 2,983 కేసులు, ఇద్దరు మృతి... లక్షకు పైగా నిర్థారణ పరీక్షలు
Also Read: Minister Harish Rao: రాబోయే 3 వారాలు చాలా కీలకం.. ప్రైవేటు ఆసుపత్రుల్లో డబ్బులు వృథా చేసుకోవద్దు
Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Kishan Reddy On TRS: తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి పెట్టుబడులు కేంద్రం ఘనతే- ప్రజలు గమనిస్తున్నారన్న కిషన రెడ్డి
Breaking News Live Updates: బండి సంజయ్ మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు, కేఏ పాల్ ఫైర్
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్
Texas School Shooting : మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?