By: ABP Desam | Updated at : 07 Aug 2021 04:36 PM (IST)
తెలంగాణ ప్రభుత్వం (ప్రతీకాత్మక చిత్రం)
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ మేరకు ఆ ఛైర్మన్‌కు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ నీరు తరలించకుండా ఆపాలని తెలంగాణ కేఆర్ఎంబీని లేఖలో కోరింది. నాగార్జున సాగర్ నీటి అవసరాల కోసం తరలింపు ఆపాలని ప్రభుత్వం సూచించింది. ఏపీ తన పరిమితికి మించి కృష్ణా నీటిని తీసుకుంటోందని తెలంగాణ లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. ఆ రాష్ట్రం ఇప్పటికే 25 టీఎంసీలు తరలించిందని గుర్తు చేసింది. నిబంధనల ప్రకారం 10.48 టీఎంసీలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవాలని సూచించింది. ఈ లేఖ మరో ప్రతిని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు కూడా పంపింది.
నీటిపారుదలపై సమీక్ష
మరోవైపు, తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం ప్రగతి భవన్‌లో నీటిపారుదల శాఖపై సమీక్ష జరిగింది. నీటి పారుదల ఇంజినీర్లు అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాలయ నిర్మాణ పనులను కూడా పర్యవేక్షించనున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో పనుల పరిశీలనకు సీఎం కేసీఆర్ వెళ్లారు.
Also Read: KRMB GRMB Meet: 9న కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి సమావేశం... రాలేమని తెలంగాణ లేఖ
గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన తరుణంలో రెండు బోర్డులు ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఆగస్టు 9న బోర్డుల ఉమ్మడి సమావేశం నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు కేఆర్‌ఎంబీ సమాచారమిచ్చింది. హైదరాబాద్‌లోని జలసౌధలో ఈ సమావేశం జరగనుంది. గెజిట్‌లోని అంశాలు అమలు, కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. జులై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ గెజిట్ జారీచేయడం తెలిసిందే. ఈ గెజిట్ ను ఏపీ ప్రభుత్వం స్వాగతించగా, తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం తెలిపింది.
ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించే బృందంలో సీడబ్ల్యూసీ సభ్యుడు దేవేందర్‌రావు ఉండటంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. దీనిపై స్పందించిన తెలంగాణ గతంలో సీడబ్ల్యూసీ సభ్యులపై తాము అభ్యంతరం చెప్పలేదని గుర్తుచేయడంతో వివాదం కొత్త మలుపు తిరిగేలా కనిపించింది. తెలంగాణ ఈఎన్‌సీ తన మురళీధర్ లేఖ లేఖ ద్వారా నిరసన వ్యక్తం చేశారు. . ఈ నెల 9న బోర్డు భేటీకి హాజరుకావట్లేదని గోదావరి బోర్డు ఛైర్మన్‌కు లేఖలో తేల్చిచెప్పారు. అంతలోనే తెలంగాణ సర్కారు మనను మార్చుకుని వివరాలు, నివేదికలు సిద్ధం చేయడానికి చర్యలు చేపట్టింది.
Also Read: కృష్ణాబోర్డు సీమ టూర్ చివరి క్షణంలో వాయిదా..! ఏపీ అభ్యంతరమే కారణం..!
KNRUHS: కటాఫ్ స్కోర్ తగ్గించిన కేంద్రం, మెడికల్ సీట్ల భర్తీకి కాళోజీ యూనివర్సిటీ నోటిఫికేషన్
MANAGE: మేనేజ్‌లో పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సు, వివరాలు ఇలా
Vijayashanthi: సొంత పార్టీ నేతలపైనే రాములమ్మ ఆగ్రహం, తలనొప్పిగా అసంతృప్తులు!
Telangana Rains: తెలంగాణకు భారీ వర్షసూచన, రాబోయే మూడు రోజుల పాటు అలర్ట్
Sridhar Babu: కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మకం - బీఆర్ఎస్ లాగా హామీలు ఇచ్చి మోసం చేయం: శ్రీధర్ బాబు
Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన
Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!
TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?
/body>