అన్వేషించండి

KRMB GRMB Meet: 9న కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి సమావేశం... రాలేమని తెలంగాణ లేఖ

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ కార్యాచరణపై 2 బోర్డులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 9న సమావేశం ఏర్పాటుచేయాలని నిర్ణయించాయి. కానీ ఈ భేటీకి రాలేమని తెలంగాణ తెలిపింది.

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైన తరుణంలో రెండు బోర్డులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 9న బోర్డుల ఉమ్మడి సమావేశం నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఏపీ, తెలంగాణలకు కేఆర్‌ఎంబీ సమాచారమిచ్చింది. హైదరాబాద్‌లోని జలసౌధలో ఈ సమావేశం జరగనుంది. గెజిట్‌లోని అంశాలు అమలు, కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయించిన కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ, జులై 15న గెజిట్‌ జారీచేసింది. ఈ గెజిట్ ను ఏపీ ప్రభుత్వం స్వాగతించగా, తెలంగాణ అభ్యంతరం వ్యక్తం తెలిపింది. ఈ విషయంపై గత నెల 28న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి రెండు బోర్డుల ఛైర్మన్లకు లేఖ రాశారు. గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అంశాలు నిర్ణయించిన గడువులోగా అమలు అయ్యేలా కార్యాచరణ రూపొందించి పంపాలని సూచించారు. ఈ వ్యవహారంపై 11 మందితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు, మంగళవారం సమావేశం ఏర్పాటు చేసింది. కమిటీలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు, పరిపాలనా విభాగం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు, ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులు ఉన్నారు. 

గెజిట్, ఇతర అంశాలపై అభ్యంతరాలను తెలంగాణ, గోదావరి బోర్డు అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. ఈ దశలోనే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 12 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తూ సోమవారం నిర్ణయం తీసుకుని, మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఇరు రాష్ట్రాలకు లేఖలు కూడా రాసింది. మొదట పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని కోరుతూ తెలంగాణ లేఖరాసింది. అలా అయితే బోర్డు సమావేశానికి హాజరవ్వగలమని చెప్తూ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరు కాలేదు. మరోవైపు ఏపీ కూడా గెజిట్‌లో కొన్ని సవరణలు చేయాలని చెప్తూ, అవి జరిగితేనే ముందుకు వెళ్తామని చెప్పింది. ఈ సమయంలో బోర్డు ఉమ్మడి సమావేశం నిర్వహించాలని నిర్ణయించడంపై ప్రాధాన్యత ఏర్పడింది. 

కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖ రాశారు. ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించే బృందంలో సీడబ్ల్యూసీ సభ్యుడు దేవేందర్‌రావు ఉండటంపై ఏపీ అభ్యంతరం తెలిపింది. దీనిపై స్పందించిన తెలంగాణ గతంలో సీడబ్ల్యూసీ సభ్యులపై తాము అభ్యంతరం చెప్పలేదని చెప్పింది. తెలంగాణ ఈఎన్‌సీ తన లేఖ ద్వారా నిరసన వ్యక్తం చేసింది. 

మరో తేదీ ఖరారు చేయండి : తెలంగాణ

గోదావరి బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖ రాశారు. ఈ నెల 9న బోర్డు భేటీకి హాజరుకావట్లేదని లేఖలో తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు, ఎన్జీటీలో విచారణ ఉన్నందున భేటీకి రాలేమని స్పష్టంచేశారు. బోర్డు భేటీకి మరో తేదీ ఖరారు చేయాలని లేఖలో కోరారు. వీలైనంత త్వరగా బోర్డును సమావేశం ఏర్పాటుచేయాలని కోరింది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు
పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు
Telangana Cabinet Expansion Postponed: తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget