అన్వేషించండి

Dalitha Bandhu: వాసాలమర్రిలో దళిత బంధు అమలు.. రూ.7.6 కోట్లు విడుదల, ఉత్తర్వులు జారీ

కేసీఆర్ ఇచ్చిన ఆ మాట ప్రకారం.. ప్రభుత్వం ఇవాళ (ఆగస్టు 5న) దళిత బంధు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే లబ్ధిదారుల ఖాతాలోకి డబ్బు జమ కానుంది.

తెలంగాణ ప్రభుత్వం వాసాలమర్రిలో దళిత బంధు పథకాన్ని అమలు చేసింది. నిన్న (ఆగస్టు 4న) సీఎం కేసీఆర్ వాసాలమర్రి పర్యటన సందర్భంగా ఆయన అనూహ్య ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆ గ్రామంలో ఉన్న అన్ని దళిత కుటుంబాలకు రూ.10 లక్షల నగదు రేపే విడుదల చేస్తామని ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆ మాట ప్రకారం ప్రభుత్వం.. ఇవాళ (ఆగస్టు 5న) దళిత బంధు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం యాదాద్రి జిల్లా వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు రూ.7.6 కోట్లు విడుదలకు అనుమతించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి జారీ చేశారు.

రూ.7.6 కోట్లను తక్షణం విడుదల చేయాల్సిందిగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఆదేశాలు జారీ చేశారు. రూ.7.6 కోట్లను ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పంచనున్నారు. ఆ డబ్బుతో లబ్ధిదారుల కుటుంబాల వారు మెరుగైన ఉపాధి కోసం ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రిలోని దళిత వాడల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సుమారు 3 గంటలపాటు పర్యటించిన సంగతి తెలిసిందే.

Also Read: Hyderabad Suicide: కుంకుమ చేజారింది, హారతి ఆరిపోయిందని ప్రాణం తీసుకున్న యువతి

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
దళిత బంధు నిధులను మంజూరు చేయడంతో గురువారం వాసాలమర్రిలోని దళిత కుటుంబాల వారు సీఎం కేసీఆర్ ఫోటోకి పాలాభిషేకం చేశారు. ఊహించ‌ని వరం కేసీఆర్‌ ఇవ్వడంతో స్థానిక దళిత కుటుంబాలు సంతోషంలో మునిగి తేలుతున్నాయి. గురువారం దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ అవ్వడంతో గ్రామమంతా డప్పుచప్పుళ్లతో సందడిగా మారింది. కేసీఆర్ చిత్ర ప‌టానికి పాలాభిషేకం చేసి ఆయ‌న‌పై తమకు ఉన్న అభిమానాన్ని గ్రామస్థులు చాటుకున్నారు.Dalitha Bandhu: వాసాలమర్రిలో దళిత బంధు అమలు.. రూ.7.6 కోట్లు విడుదల, ఉత్తర్వులు జారీ

దళిత బంధు అనే పేరుపై అభ్యంతరం
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘దళిత బంధు’ పథకం పేరుపై జాతీయ ఎస్సీ కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఎస్సీ కమిషన్ నోటీసులు కూడా ఇచ్చింది. దళిత బందు పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ.. మాల సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు బత్తుల రామ్ ప్రసాద్ జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు అందులో పిటిషన్ దాఖలు చేయగా.. ఎస్సీ కమిషన్ కూడా దానిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. 

దళిత బంధులో ‘దళిత’ అనే స్థానంలో ‘అంబేడ్కర్’ అనే పదాన్ని వాడాలని మాల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు బత్తుల రామ్ ప్రసాద్ సూచించారు. ‘దళిత’ అనే పదానికి ‘అంటరానివారు’, ‘తక్కువ చూపునకు గురయ్యేవారు’, ‘నిస్సహాయులు’ అనే అర్థాలు వస్తున్నాయని కాబట్టి దాన్ని మార్చాలని బత్తుల రామ్ ప్రసాద్ పిటిషన్‌లో వివరించారు. ఇందులో భాగంగా జాతీయ ఎస్సీ కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి నోటిసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా ఆ అంశంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించింది.

Also Read: Secunderabad: ట్రైన్‌లో తన బ్యాగ్ ఎవరో కొట్టేశారని... స్టేషన్‌లో మరో బ్యాగ్ లేపేశాడు... ట్విస్టులు మమూలుగా లేవు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Pemmasani Chandra Sekhar: ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Allari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP DesamDuvvada Srinivas Interview | టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఇంటర్వ్యూ | ABPHyderabad 16Cars Fire Accident | హైదరాబాద్ యూసుఫ్ గూడలో అగ్నికి ఆహుతైపోయిన 16కార్లు | ABP DesamPawan kalyan Touches feet of Pastor | పిఠాపురంలో మహిళా పాస్టర్ కాళ్లు మొక్కిన పవన్ కళ్యాణ్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Pemmasani Chandra Sekhar: ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
IMD: దేశంలో మరో 5 రోజులు భానుడి ఉగ్రరూపం - ఐఎండీ అలర్ట్
దేశంలో మరో 5 రోజులు భానుడి ఉగ్రరూపం - ఐఎండీ అలర్ట్
Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
Thota Trimurtulu : తోట త్రిమూర్తులు జైలు శిక్షపై స్టేకు హైకోర్టు నిరాకరణ - పోటీ చేయడానికి అర్హత ఉంటుందా ?
తోట త్రిమూర్తులు జైలు శిక్షపై స్టేకు హైకోర్టు నిరాకరణ - పోటీ చేయడానికి అర్హత ఉంటుందా ?
Embed widget