News
News
X

Hyderabad Suicide: కుంకుమ చేజారింది, హారతి ఆరిపోయిందని ప్రాణం తీసుకున్న యువతి

పూజ చేస్తుండగా అపశ్రుతులు జరగడంతో ఇక తన ఆయుష్షు అయిపోయిందని భావించి వెంటనే ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిధిలో చోటు చేసుకుంది.

FOLLOW US: 

హైదరాబాద్‌లో ఓ మహిళ విచిత్రమైన నమ్మకాలతో ఆత్మహత్య చేసుకుంది. పూజ చేస్తుండగా హారతి ఆరిపోవడం, దేవుడికి బొట్టు పెడుతుండగా కుంకుమ బరిణె కింద పోవడంతో అవన్నీ అరిష్టాలని భావించిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, అప్పటికే కొన్ని గొడవల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. పూజ చేస్తుండగా అపశ్రుతులు జరగడంతో ఇక తన ఆయుష్షు అయిపోయిందని భావించి వెంటనే ఉరేసుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిధిలో చోటు చేసుకుంది.

ముందు నుంచే భర్తతో గొడవలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన భార్యాభర్తలు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఓం ప్రకాశ్‌, కవిత ప్రేమించుకొని ఆరేళ్ల క్రితమే వివాహం చేసుకున్నారు. వీరు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 78 సమీపంలోని అంబేద్కర్‌ నగర్‌లో ఓ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నారు. వీరికి ఓ నాలుగేళ్ల కూతురు కూడా ఉంది. ఈ ఓం ప్రకాశ్ వాచ్ మెన్‌గా పని చేస్తుంటాడు. మంగళవారం రాత్రి తన కూతురు కూడా తన డ్యూటీకి తీసుకెళ్లి రాత్రి 7.30 గంటలకు తిరిగి వచ్చాడు. అయితే, ఎన్నిసార్లు తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో కిటికీలో నుంచి చూశాడు. లోపల తన భార్య ఉరేసుకొని ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది.

దీంతో వెంటనే ఓంప్రకాశ్ ఇంటి ఓనర్ సాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లాడు. అప్పటికే ఆమె చనిపోయి ఉంది. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించగా.. వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల వస్తువులను పోలీసులు పరిశీలించగా.. పక్కనే కుంకుమ బరిణె కింద పడిపోయి ఉంది. దీపాలు వెలుగుతున్నాయి. హారతి ఆరిపోయి ఉంది. ఆమె ఫోన్‌ను పరిశీలించగా.. ఆత్మహత్యకు ముందు తీసుకున్న ఓ సెల్ఫీ వీడియో కనిపించింది.

Also Read: Telangana: వృద్ధాప్య పెన్షన్ వయసు పరిమితి తగ్గింపు.. ఇకనుంచి వీళ్లందరికీ ఆసరా పింఛన్లు

News Reels

దేవుడికి పూజ చేసే సమయంలో హారతిచ్చే ప్రయత్నం చేయగా అది ఆరిపోయింది.. దేవుడికి బొట్టు పెట్టాలని ప్రయత్నిస్తే అది చేజారింది. ఇవన్నీ అరిష్టాలే అని తన ఆయుష్షు తీరిందని సెల్ఫీ వీడియోలో ఆమె చెప్పినట్లుగా పోలీసులు వెల్లడించారు. అయితే, ఈ విషయంలో భర్తను పోలీసులు విచారణ జరపగా ఇద్దరికీ కొద్ది రోజులుగా గొడవలు ఉన్నట్లు తెలిపాడు. దీంతో అప్పటికే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె.. చివరిసారి దేవుడికి పూజ చేసే క్రమంలో ఈ అపశ్రుతులు జరిగాయని, వాటిని అరిష్టాలని నమ్మి ఆమె వెంటనే ప్రాణాలు తీసుకుందని పోలీసులు వెల్లడించారు.

Also Read: Weather Updates: తెలంగాణకు వర్ష సూచన, కొన్ని జిల్లాల్లోనే వానలు.. ఏపీలో వాతావరణం ఇలా..

Published at : 05 Aug 2021 11:34 AM (IST) Tags: Hyderabad Woman suicide jubilee hills woman suicide Kumkum pooja death

సంబంధిత కథనాలు

Weather Latest Update: ఏపీలో ఎక్కువగా దుమ్ము గాలులు, ఎప్పుడు అదుపులోకి వస్తాయంటే - పెరుగుతున్న చలి

Weather Latest Update: ఏపీలో ఎక్కువగా దుమ్ము గాలులు, ఎప్పుడు అదుపులోకి వస్తాయంటే - పెరుగుతున్న చలి

Gold-Silver Price 1 December 2022: 54 వేల వైపు పరుగులు పెడుతున్న బంగారం- మీ ప్రాంతాల్లో రేటు తెలుసా?

Gold-Silver Price 1 December  2022: 54 వేల వైపు పరుగులు పెడుతున్న బంగారం- మీ ప్రాంతాల్లో రేటు తెలుసా?

AP Police Constable Application: ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులు, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?

AP Police Constable Application: ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులు, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?

KNRUHS: ఎంబీబీఎస్‌ వెబ్‌ఆప్షన్లకు డిసెంబ‌ర్ 1 వరకు గడువు! నర్సింగ్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్!

KNRUHS: ఎంబీబీఎస్‌ వెబ్‌ఆప్షన్లకు డిసెంబ‌ర్ 1 వరకు గడువు! నర్సింగ్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్!

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Gujarat Election 2022: గుజరాత్‌ తొలి దశలో 89 స్థానాలకు కాసేపట్లో పోలింగ్ జరగనుంది

Gujarat Election 2022: గుజరాత్‌ తొలి దశలో 89 స్థానాలకు కాసేపట్లో పోలింగ్ జరగనుంది

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని