By: ABP Desam | Updated at : 05 Aug 2021 09:51 AM (IST)
ఆసరా పెన్షన్ల వయసు పరిమితి తగ్గింపు
తెలంగాణలో ఎట్టకేలకు వృద్ధాప్య పింఛను అర్హత వయసును తగ్గించారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు ప్రస్తుతం 65 ఏళ్లుగా ఉన్న ఆసరా వృద్ధాప్య పింఛను పథకం అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గించారు. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా జీవో జారీ చేశారు. ఆసరా పింఛన్ల అర్హత వయసును తగ్గించాలని ఆదివారం కేబినెట్ సమావేశంలో తీర్మానించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో 37 లక్షల మందికి ప్రస్తుతం వృద్ధాప్య పింఛను అందుతోంది. దీనినే ఆసరా పింఛను అని పిలుస్తారు. ఒక్కొక్కరికీ నెలకు రూ.2,016 చొప్పున ప్రభుత్వం ఇస్తూ వస్తోంది. మరో 5 లక్షల మంది దివ్యాంగులకు నెలకు రూ.3,016 అందుతోంది. ఏపీలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వృద్ధాప్య పింఛన్ కేవలం రూ.200 మాత్రమే ఉండేది. తెలంగాణ రాష్ట్రంలో దానిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం మొదట రూ.వెయ్యి, ఆ తర్వాత రూ.2 వేలకు పెంచింది. కరోనా లాక్ డౌన్ సమయంలోనూ ఈ ఆసరా పింఛన్లకు ఎలాంటి లోటు లేకుండా నిధులు సమకూర్చింది. అంతేకాక, రాష్ట్రంలో కల్లు గీత, బీడీ, చేనేత కార్మికులు, వితంతువులు, ఎయిడ్స్ రోగులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా బాధితులు, చేనేత కార్మికులకు కూడా పింఛన్ అందిస్తున్నారు.
‘ఆసరా’కు నెలకు ఎన్ని కోట్ల ఖర్చంటే..
నెల నెలా వృద్ధులకు ఇస్తున్న ఆసరా పింఛన్లకు 2019లో రూ.7,427.32 కోట్లు, ఆ తర్వాతి ఏడాది 2020లో రూ.9,828.33 కోట్లు ప్రభుత్వం ఖర్చుపెట్టింది. ఇప్పుడు అర్హత వయసును తగ్గించడంతో ఈ నిధులు ఇంకా పెరగనున్నాయి. అంచనా ప్రకరాం 57 ఏళ్ల వయసు పైబడి పింఛను ఇవ్వాలంటే ఏటా రూ.12 వేల కోట్ల వరకు అవసరం కానున్నాయి. 2021-22 బడ్జెట్‌లో పింఛన్లకు ఈ మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించింది.
Also Read: Gold-Silver Price: స్థిరంగా బంగారం ధర, వెండి మాత్రం పైపైకి.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇలా..
అర్హత ఎలాగంటే..
గ్రామాల స్థాయిలో దరఖాస్తులు స్వీకరించి అర్హులకు పింఛన్లను మంజూరు చేస్తున్నారు. పింఛను వయసు నిర్ధారణకు ఓటరు కార్డు, ఆధార్ కార్డు వంటి వాటిని ప్రామాణికంగా తీసుకుంటారు. 50 ఏళ్లు పైబడిన గీత, చేనేత కార్మికులు, 18 ఏళ్లు నిండిన వితంతువులు, 40 శాతానికిపైగా వైకల్యం ఉన్న దివ్యాంగులు, మూడెకరాలలోపు తరి, 7.5 ఎకరాలు మించకుండా మెట్ట భూమి ఉన్నవారు అర్హులవుతారు.
Also Read: Weather Updates: తెలంగాణకు వర్ష సూచన, కొన్ని జిల్లాల్లోనే వానలు.. ఏపీలో వాతావరణం ఇలా..
TS SSC Exams : రేపటి నుంచి తెలంగాణ పదో తరగతి పరీక్షలు, ఐదు నిమిషాల నిబంధన వర్తింపు
Breaking News Live Updates: కర్నూలు జిల్లాలో విషాదం, పెళ్లి మండపంలో వరుడు హఠాన్మరణం
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
Minister Harish Rao : పెట్రోల్, డీజిల్ సుంకాల తగ్గింపుపై స్పందించిన మంత్రి హరీశ్ రావు, ఏమన్నారంటే?
Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత
Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!
IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్లు ఎప్పుడు ?
Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?