Omicron Updates: తెలంగాణలో కొత్తగా 5 ఒమిక్రాన్ కేసులు... కొత్తగా 280 కరోనా కేసులు, ఒకరు మృతి

తెలంగాణలో తాజాగా 5 ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 67కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా 280 కరోనా కేసులు నమోదయ్యాయి.

FOLLOW US: 

తెలంగాణలో తాజాగా 5 ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 67కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 143 మంది శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకు వచ్చారు. వీరందరికీ కోవిడ్‌ ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు చేయగా నలుగురు ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అధికారులు వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. రాష్ట్రంలో కొత్తగా 5 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 67కి చేరింది. ఇప్పటివరకు ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి తెలంగాణకు 12,410 మంది వచ్చారు.

కొత్తగా 280 కరోనా కేసులు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 37,926 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరిలో కొత్తగా 280 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,81,587కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో ఒక్కరు మరణించారు. కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,025కి చేరింది. కరోనా బారి నుంచి బుధవారం 206 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 3,563 యాక్టివ్‌ కేసులన్నాయి. 

Also Read: నక్షత్రం ప్రకారం వచ్చే అక్షరంతో పేరు పెట్టకపోతే ఏం జరుగుతుంది..

ఒమిక్రాన్ నుంచి ఇప్పటి వరకూ 22 మంది కోలుకున్నారు. తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రెండు, మూడు రోజులుగా కేసులు పెరుగుదల కనిపిస్తోందని, ఇంకొద్ది రోజుల్లో కేసు తారా స్థాయికి పెరుగుతాయని అంచనా వేశారు. ఈ కేసుల పెరుగుదల థర్డ్ వేవ్‌కి సంకేతం అని డీహెచ్ అన్నారు. డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తిస్తోందని అన్నారు. ఒమిక్రాన్ బాధితుల్లో 90 శాతం లక్షణాలు కనిపించడం లేదని.. లక్షణాలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోఠిలోని ఆయన కార్యాలయంలో డీహెచ్ మీడియా సమావేశం నిర్వహించారు.

Also Read: హైవేపై కుప్పలుతెప్పలుగా కొత్త కరెన్సీ నోట్లు కలకలం.. అవాక్కయిన స్థానికులు, ఏం జరిగిందంటే..

‘‘నిన్న ఒక్కరోజే అమెరికాలో 4 లక్షల ఒమిక్రాన్ కేసులు, ఫ్రాన్స్‌లో 2 లక్షల కేసులు, యూకేలో 1.8 లక్షలు, స్పెయిన్‌లో లక్షకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కొత్త వేరియంట్‌కి ఈ దేశాలు కేంద్రంగా మారాయి. ప్రస్తుతం ప్రపంచంలో 135 దేశాల్లో ఒమిక్రాన్ ఉంది. మన దేశంలో దాదాపు 19 శాతం కేసులు పెరుగుతున్నాయి. పది వేల నుంచి 13 వేల కేసులు నిన్న ఒక్కరోజే మన దేశంలో పెరిగాయి. తెలంగాణలోనూ మరింత సంఖ్యలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతాయి. వచ్చే 2 నుంచి 4 వారాలు చాలా కీలకం. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ ఒమిక్రాన్ వేరింయట్ వల్ల విపరీతమైన కేసులు పెరుగుతాయి. అతి కొద్ది రోజుల్లోనే గ్రాఫ్ పైకి ఎగబాకడం చూడబోతున్నాం. విదేశాల్లో కూడా ఇదే పరిస్థితులు చూశాం. ఇది థర్డ్ వేవ్‌కు సూచిక అని చెప్పుకోవచ్చు. 

Also Read:  హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటున్నారా ? ఇదిగో ఈ రూల్స్ అన్నింటినీ గుర్తు పెట్టుకోండి..

అయితే, ఈ థర్డ్ వేవ్‌కు భయపడాల్సిన పని లేదు. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాం. ఇప్పటికే అన్ని మౌలిక వసతుల పరంగా సిద్ధంగా ఉన్నాం. అయితే, సుమారు 90 శాతం మందిలో ఒమిక్రాన్ వ్యాధి లక్షణాలు కనిపించడం లేదు. మిగతా 10 శాతం మందిలో వ్యాధి లక్షణాలు ఉంటున్నాయి. వీరు జాగ్రత్తగా ఉండాలి. కరోనా లక్షణాలు కనపడగానే పరీక్షలు చేయించుకొని ఎవరికివారు ఐసోలేషన్‌లోకి వెళ్లిపోవాలి.’’ అని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు అన్నారు.

Also Read: గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 30 Dec 2021 08:26 PM (IST) Tags: Covid news Telangana Corona Cases New Corona Cases omicron cases

సంబంధిత కథనాలు

Petrol Diesel Price 19th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్,డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా ఉన్నాయి

Petrol Diesel Price 19th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్,డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా ఉన్నాయి

Weather Updates : చురుగ్గా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు

Weather Updates : చురుగ్గా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు

Gold Silver Price Today 19th May 2022 : స్వల్పంగా తగ్గిన బంగారం రేట్లు- మీ నగరాల్లో ఉన్న ధరలు ఇవే

Gold Silver Price Today 19th May 2022 : స్వల్పంగా తగ్గిన బంగారం రేట్లు- మీ నగరాల్లో ఉన్న ధరలు ఇవే

PM Modi Telangana Tour: మే 26న తెలంగాణకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర బీజేపీలో పెరిగిన జోష్

PM Modi Telangana Tour: మే 26న తెలంగాణకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర బీజేపీలో పెరిగిన జోష్

IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి

IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Dengue Diet: డెంగ్యూ జ్వరం వస్తే తినాల్సినవి ఇవే, వీటితో సమర్థంగా ఎదుర్కోవచ్చు

Dengue Diet: డెంగ్యూ జ్వరం వస్తే తినాల్సినవి ఇవే, వీటితో సమర్థంగా ఎదుర్కోవచ్చు

Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?

Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?

AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర

AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర

CM KCR On Dalit Bandhu: దళితబంధు పథకం లబ్ధిదారులను ఎంపిక చేయండి - అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం

CM KCR On Dalit Bandhu: దళితబంధు పథకం లబ్ధిదారులను ఎంపిక చేయండి - అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం