అన్వేషించండి

Sahitya Akademi Award: గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

ప్రజాకవి గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన రాసిన వల్లంకి తాళం కవితాసంపుటికి ఈ పురస్కారం లభించింది.

ప్రజా కవి గోరటి వెంకన్నకు 2021గానూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఆయన రాసిన 'వల్లంకి తాళం' కవితాసంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తగుళ్ల గోపాల్ కు సాహిత్య అకాడమీ యువ పురస్కార్ దక్కింది. ఆయన రచించిన.. దండకడియం రచనకు అవార్డుకు ఎంపికయ్యారు. బాల సాహిత్య పురస్కారానికి దేవరాజు మహారాజు ఎంపికయ్యారు. ‘నేను అంటే ఎవరు’ నాటకానికి గానూ ఈ పురస్కారం దక్కింది.

కవితల విభాగంలో మవాడీ గహాయి(బోడో), సంజీవ్ వెరెంకర్(కొంకణి), హృషీకేశ్ మాలిక్(ఒడియా), మీథేశ్ నిర్మొహీ(రాజస్థానీ), బిందేశ్వరీప్రసాద్ మిశ్ర(సంస్కృతం), అర్జున్ చావ్లా(సింధి)లకు పురస్కారాలు దక్కాయి. కథా రచయితలు రాజ్ రాహీ(డోగ్రీ), కిరణ్ గురవ్(మరాఠీ), ఖలీద్ హుసేన్(పంజాబీ), నిరంజన్ హంస్డా (సంతాలీ), అంబాయి(తమిళం)కు సాహిత్య పురస్కారాలు వచ్చాయి. నవలా రచయితలు అనురాధా శర్మ పుజారీ(అస్సామీ), నమితా గోఖలే(ఇంగ్లిష్)కు అవార్డులు వచ్చాయి.

బయోగ్రఫీ దాంట్లో.. కన్నడ రచయిత డీఎస్ నాగభూషణ, స్వీయచరిత్ర విభాగంలో జార్జ్ ఒనక్కూర్(మళయాలం), నాటక విభాగంలో బ్రాత్య బసు( బెంగాలీ), దయా ప్రకాశ్ సిన్హా(హిందీ)కి అవార్డులు వచ్చాయి.

గోరటి వెంకన్నకు చిన్నప్పటి నుంచే పాటలంటే ప్రాణం

గోరటి వెంకన్న 1963 లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, గౌరారంలో జన్మించాడు.  చిన్నప్పటి నుంచే వెంకన్నకు పాటలంటే మహా ఇష్టం. గోరటి వెంకన్న ప్రజాకవి, గాయకుడు. పల్లె ప్రజలు, ప్రకృతే ఆయన పాటల రూపంలో కనిపిస్తుంటాయి. రైతుల సమస్యలపై పాటలు రాస్తున్న సమయంలో 1984 లో ఆయన రాసిన నీ పాట ఏమాయెరో నీ మాట ఏమాయరో అనే పాట చాలా పేరు తెచ్చిపెట్టింది. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల.. నా తల్లి కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల లాంటి పాటలు ఇప్పటికీ.. ప్రజలు పాడుకుంటూనే ఉంటారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాటలతో.. ఆకట్టుకునేవారు. 2016లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు. 2020లో గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు.

Also Read: Omicron in Telangana: కొద్దిరోజుల్లో TSలో తార స్థాయికి ఒమిక్రాన్.. 90 శాతం మందికి లక్షణాల్లేవు: డీహెచ్

Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఏపీలో ఇక్కడ ఇంకా తీవ్రమైన చలి

Also Read: Hyderabad: మీరు అపార్ట్‌మెంట్లలో ఉంటారా? ఈ సౌకర్యం ఫ్రీగా పొందండి.. ఇంకా రెండు రోజులే ఛాన్స్

Also Read: Khammam Politics 2021: ఒడిదుడుకుల కారు పయనం.. ప్రతిపక్షాలకు చిక్కని ఖమ్మం జిల్లా ప్రజల నాడి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Allu Arjun Bail Cancel: సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
AIIMS: 'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది'  మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది' మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
Social Media Fire: మూడో టెస్టులో సంబరాలెందుకు ?  గంభీర్ హయాంలో పతనవస్థకు టీమిండియా! ఫ్యాన్స్ ఫైర్
మూడో టెస్టులో సంబరాలెందుకు ?  గంభీర్ హయాంలో పతనవస్థకు టీమిండియా! ఫ్యాన్స్ ఫైర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

టీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్పార్లమెంంట్‌కి రకరకాల హ్యాండ్‌బ్యాగ్‌లతో ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Allu Arjun Bail Cancel: సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
AIIMS: 'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది'  మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది' మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
Social Media Fire: మూడో టెస్టులో సంబరాలెందుకు ?  గంభీర్ హయాంలో పతనవస్థకు టీమిండియా! ఫ్యాన్స్ ఫైర్
మూడో టెస్టులో సంబరాలెందుకు ?  గంభీర్ హయాంలో పతనవస్థకు టీమిండియా! ఫ్యాన్స్ ఫైర్
BRS MLAs Protest: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క
One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
Manchu Manoj Mother Wrote A Letter: మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
Russia Moscow Blast: రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
Embed widget