By: ABP Desam | Updated at : 15 Mar 2022 08:48 AM (IST)
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
Telangana Budget Sessions: నేటితో తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. నేడు (మార్చి 15న) 2022–23 ఆర్థిక సంవత్సరానికిగానూ ద్రవ్యవినిమయ బిల్లును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఉభయసభల్లో దీనిపై చర్చజరగనుంది. మార్చి 7న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. ప్రారంభానికి ముందే వివాదానికి కేంద్ర బిందువుగా మారడం తెలిసిందే. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీనిపై ప్రతిపక్షాలు గగ్గోలుపెట్టినా, అధికార టీఆర్ఎస్ మాత్రం తమదైన శైలిలో సమావేశాలను నిర్వహిస్తోంది.
ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ..
మార్చి 7న తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను ఆర్థికశాఖమంత్రి హరీశ్‌రావు (Telangana Finance Minister Harish Rao) ప్రవేశపెట్టారు. మరుసటి రోజు విరామం ఇవ్వగా, తిరిగి మార్చి 9న బడ్జెట్‌పై సాధారణ చర్చ ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు పద్దులపై ఉభయసభలలో చర్చ జరిగింది. తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాలలో మొత్తం 37 పద్దులకు శాసనసభ ఆమోదం తెలిపింది. నేడు ద్రవ్యవినిమయ బిల్లుపై ఉభయసభల్లో చర్చించనున్నారు. ఎఫ్ఆర్ఎంబీ, మార్కెట్ కమిటీల చట్ట సవరణల బిల్లులను శాసనసభ ఇదివరకే ఆమోదం తెలపగా, నేడు శాసన మండలిలో చర్చ జరగనుంది.
మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభల్లో నేడు ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. మార్చి 2020తో ముగిసిన ఏడాదికి సంబంధించి కాగ్ విడుదల చేసిన నివేదికలను శాసనసభ, మండలిలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం అనంతరం శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదే సమావేశాల్లో ఉద్యోగాలపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన..
నిరుద్యోగులకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ఉద్యోగుల విభజన జరిగిన తర్వాత 91,142 ఖాళీలు ఏర్పడ్డాయని.. వీటిని వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అంతేకాక, మరో 11,103 వేల కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 80,039 వివిధ శాఖల్లోని ఉద్యోగాలకు తక్షణం నోటిఫికేషన్ విడుదల చేస్తామని అన్నారు. వీటిలో విద్యాశాఖలోనే 25 నుంచి 30 వేల ఉద్యోగాలు ఉన్నట్లు చెప్పారు. ఇకపై తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఉండబోవని స్పష్టం చేశారు. ఇకపై ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుందని వెల్లడించారు.
అంతులేని వివక్షతో తెలంగాణ ఎన్నో ఇబ్బందులు పడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ అన్నారు. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకూ ఇదే పరిస్థితి కొనసాగిందని అన్నారు. తెలంగాణ రైతులను కూడా పూర్తిగా పాతాళంలోకి నెట్టేశారని గుర్తు చేశారు. ఎన్నో ఆకలి చావులు, నిరుద్యోగులు, రైతుల మరణాలు చూశామని వెల్లడించారు. తెలంగాణ తనను తాను నిర్వచించుకోవాలనే ఉద్దేశంతో తాను ఉద్యమానికి శ్రీకారం చుట్టానని అన్నారు. విద్యార్థులు కూడా ఎంతో మంది తెలంగాణ కోసం ఉద్యమించారని అన్నారు.
Also Read: KCR Jobs Announcement: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్, కేసీఆర్ సంచలన ప్రకటన
Rains in AP Telangana: తీవ్ర వాయుగుండం - నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD
Gold-Silver Price: బంగారం నేడు భారీ షాక్! ఊహించని రీతిలో పైకి - వెండి కూడా పైపైకి
తెలంగాణ బీజేపీకి మరింత సినీ జోష్- పార్టీలో చేరనున్న జయసుధ!
World Tribal Day : 75 ఏళ్ల స్వాతంత్య్రంలో మారని బతుకులు, ఆదివాసీల ఆవేదన
కొత్త కలెక్టరేట్ ప్రారంభానికి మోక్షమెప్పుడు?
Liger Team At Mumbai : వాళ్ళిద్దరి బాండింగ్ అలాంటిది - ముంబైలో లవ్లీ 'లైగర్' జోడీ
Harsha Kumar Son Case : యువతితో అసభ్య ప్రవర్తన, మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడిపై కేసు నమోదు
Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!
Tirumala News : శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్, తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి