BJP MLAs Not Allowed: బీజేపీ ఎమ్మెల్యేలకు చివరిరోజు సైతం తీవ్ర నిరాశే - సభకు అనుమతించని స్పీకర్
Speaker Pocharam Not Allows Suspended BJP MLAs: తమను సమావేశాలకు అనుమతించాలని అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కోరారు. కానీ వారిని సభకు అనుమతించడానికి స్పీకర్ నిరాకరించారు.
BJP MLAs Not Allowed: సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలకు మరోసారి నిరాశే ఎదురైంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీతో ఎమ్మెల్యేలు నేటి ఉదయం ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావు అసెంబ్లీకి చేరుకున్నారు. తమను బడ్జెట్ సమావేశాలకు అనుమతించాలని అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కోరారు. ఈ మేరకు కోర్టు ఇచ్చిన తీర్పు కాపీని సమర్పించారు. కానీ స్పీకర్ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను సమావేశాలకు అనుమతించడానికి నిరాకరించారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలకు సమావేశాల చివరి రోజూ నిరాశే ఎదురైంది.
బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు, రాజా సింగ్‌లను ను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నేడు సైతం అసెంబ్లీలోకి అనుమతివ్వలేదు. తాము సభ నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని స్పీకర్ మరోసారి స్పష్టం చేశారు. తమ అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించడంతో బీజేపీ ఎమ్మెల్యేలు నిరాశగా వెనుదిరిగారు. తమను సమావేశాలకు హాజరు కావడానికి స్పీకర్ పోచారం అనుమతించలేదని ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
డివిజన్ బెంచ్ తీర్పు..
తమను సమావేశాల నుంచి సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్ జడ్జి కొట్టివేయడంపై దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది. సెషన్ మొత్తం హాజరుకాకుండా బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ విధించడానికి సహేతుకమైన కారణాలు లేవని భావిస్తున్నామని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డిలతో కూడిన బెంచ్ సోమవారం తీర్పునిచ్చింది. శాసనసభ కార్యదర్శిని కలిసి వినతిపత్రం సమర్పించాలని సూచించింది. కోర్టు ఆర్డర్ తీర్పుతో అసెంబ్లీకి వెళ్లినా స్పీకర్ వారి అభ్యర్థనను మన్నించలేదు. సభ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని స్పీకర్ పోచారం చెప్పారని సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలు తెలిపారు.
RRRకు ప్రభుత్వం షాక్
Eeta Rajender Suspend from Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన రోజే భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజా సింగ్, రఘునందన్ రావు సస్పెండ్ అయ్యారు. బడ్జెట్ ప్రసంగానికి అడ్డు పడుతున్నారన్న కారణంగా ఈ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సస్పెండ్ చేశారు. అయితే కేవలం ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నారని భావించిన బీజేపీకి భారీ షాకిస్తూ.. శాసనసభ సమావేశాలు ముగిసే వరకు ఈ ముగ్గురు సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ పోచారం ఇటీవల ప్రకటించారు.
Also Read: BJP MLAs Suspend: బీజేపీకి భారీ షాక్ ! ఈటల, రాజా సింగ్, రఘునందన్ రావులు సెషన్ మొత్తం సస్పెండ్