అన్వేషించండి

BJP MLAs Suspend: బీజేపీకి భారీ షాక్ ! ఈటల, రాజా సింగ్, రఘునందన్ రావులు సెషన్ మొత్తం సస్పెండ్

BJP MLAs Suspend: శాస‌న‌స‌భ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు ఈట‌ల రాజేంద‌ర్, రాజా సింగ్, ర‌ఘునంద‌న్ రావులను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం ప్ర‌క‌టించారు. 

Eeta Rajender Suspend from Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన రోజే భార‌తీయ జ‌న‌తా పార్టీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈట‌ల రాజేంద‌ర్, రాజా సింగ్, ర‌ఘునంద‌న్ రావు సస్పెండ్ అయ్యారు. బడ్జెట్ ప్రసంగానికి అడ్డు పడుతున్నారన్న కారణంగా ఈ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సస్పెండ్ చేశారు. అయితే కేవలం ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నారని భావించిన బీజేపీకి భారీ షాకిస్తూ.. శాస‌న‌స‌భ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు ఈ ముగ్గురు సభ్యులను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం ప్ర‌క‌టించారు. 

అసెంబ్లీ ఎదుట బైఠాయించిన బీజేపీ ఎమ్మెల్యేలు.. అరెస్ట్
తెలంగాణ బడ్జెట్ ప్రసంగానికి బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డు తగులుతున్నారని, వారిని సస్పెండ్ చేయాలని మంత్రి తలసాని శ్రీనివాయస్ యాదవ్ తీర్మానం ప్రవేశపెట్టగా.. ఈటల, రాజా సింగ్ (Raja Singh Suspend from Telangana Assembly), రఘునందన్ రావులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు అసెంబ్లీ స్పీకర్ పోచారం. సెషన్ పూర్తయ్యే వారికి సస్పెన్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ నుంచి తమను ఉద్దేశపూర్వకంగానే సస్పెండ్ చేశారని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే తమను సస్పెండ్ చేశారని అసెంబ్లీ ఎదుట బైఠాయించి బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఆందోళన విరమించకపోవడంతో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకుని అసెంబ్లీ నుంచి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

వ్యూహాత్మకంగా అధికార పార్టీ..
తనను అవమానకరంగా పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత దూకుడు పెంచిన ఈటల రాజేందర్ (Etela Rajender) ఈ అసెంబ్లీ సమావేశాల్లో తొలిసారి మరోపార్టీ నేతగా సీఎం కేసీఆర్‌ను ఎలా ఎదుర్కుంటారో చూద్దామని బీజేపీ నేతలతో పాటు హుజురాబాద్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన రోజే బీజేపీ పార్టీ వ్యూహాలను అధికార పార్టీ టీఆర్ఎస్ ఛేదించినట్లు కనిపిస్తోంది. సభలో టీఆర్ఎస్ పాలనను ఎండగడుతూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌కు ట్రిపుల్ ఆర్ (రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్) సినిమా చూపిస్తారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల పలుమార్లు ప్రస్తావించారు.

గొంతెత్తక ముందే ఈటలకు షాక్ !  
సాధారణ కార్యకర్త స్థాయి నుంచి పార్టీలో సీఎం కేసీఆర్‌కు కుడి భుజంగా మారిన ఈటల రాజేందర్‌‌కు గత ఏడాది ఒక్కసారిగా చేదు అనుభవం ఎదురైంది. ఈటలతో కనీసం వివరణ కూడా తీసుకోకుండా మంత్రి పదవి నుంచి ఆయనను బర్తరఫ్ చేశారు. ఆపై తనకు జరిగిన అవమానాల్ని తట్టుకోలేక టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై 23 వేల పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. తాజాగా జరగనున్న సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ను విపక్ష పార్టీ నేతగా ఎదుర్కోవాలని, తోటి బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజా సింగ్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావించిన ఈటల రాజేందర్‌కు నిరాశే ఎదురైంది. అసెంబ్లీలో తమ గొంతు వినిపించక ముందే సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. 

Also Read: Telangana Budget 2022-23 LIVE: అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు RRR సస్పెన్షన్, ఈ సెషన్ పూర్తయ్యేదాకా నో ఎంట్రీ!

Also Read: KCR vs Etela Rajender: అందరి కళ్లు ఈటల పైనే ! అసెంబ్లీలో ఎదురుపడనున్న సీఎం కేసీఆర్, ఈటల

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget