అన్వేషించండి

Jubilee Hills By-Elections : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు>? ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది?

Jubilee Hills By-Elections : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ ఓటర్ల లెక్కలపై క్లారిటీ ఇచ్చేసింది ఎలక్షన్ కమిషన్.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది.
  • అర్హత తేదీని బట్టి తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
  • నియోజకవర్గంలో మొత్తం 3,99,000 మంది ఓటర్లు నమోదు అయ్యారు.
  • ఉప ఎన్నికల కోసం 139 కేంద్రాలలో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.

Jubilee Hills By-Elections : తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపైన ప్రధాన పార్టీలు కోటి ఆశలు పెట్టుకున్నాయి. గెలిచేది ఒక్క నియోజవర్గమైనప్పటికీ ఆ లెక్కలు అధికారపార్టీ పనితీరుకు కొలమానంగా మారబోతున్నాయనే వాదనల నేపధ్యంలో అటు అధికార పార్టీతోపాటు ఇటు సిట్టింగ్ సీటు కోసం ప్రతిపక్ష బిఆర్ఎస్, మేము కూడా తగ్గేదే లేదంటూ బిజేపిలు ఇలా త్రిముక పోరుతో జూబ్లీహిల్స్‌లో ఢీ అంటే ఢీ అంటున్నాయి. త్వరలో నోటిఫికేషన్ విడుదలకానున్న వేళ ఓటర్ల లెక్కలపై తాజాగా క్లారిటీ ఇచ్చేసింది ఎలక్షన్ కమిషన్. ఓటర్లు లెక్కలను బట్టే అభ్యర్దుల తలరాతలు మారిపోతాయి. ఇన్నాళ్లు ఊహజనిత కథనాలు, కాకిలెక్కలు ఇక చాలంటూ తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఫైనల్ లెక్కలు విడుదల చేశారు ఎలక్షన్ కమిషన్ సీఈవో సుధర్శన్ రెడ్డి.

అతి త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు సంబంధించిన ఫైనల్ ఓటర్ల జాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,000గా ఉందని ముఖ్య ఎన్నికల అధికారి (CEO) సుధర్శన్ రెడ్డి ప్రకటించారు. జూలై 1, 2025ను అర్హత తేదీగా తీసుకుని సవరించిన జాబితాలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారని తెలిపారు.

లింగ నిష్పత్తి ప్రకారం ప్రతి వెయ్యి పురుషులకు 924 మహిళలుగా ఉండగా, ఈ జాబితాలో 6,106 మంది యువ ఓటర్లు (18–19 సంవత్సరాలు), 2,613 మంది వృద్ధులు (80 ఏళ్లుపైబడిన వారు), అలాగే 1,891 మంది వికలాంగులు ఉన్నారు. వీరిలో 519 మంది చూపు కోల్పోయిన వారు, 667 మంది కదలికల లోపం ఉన్న వారు, 311 మంది వినికిడి/మాట లోపం కలిగిన వారు ఉన్నారు. అంతేకాదు 722 మంది ఇతర కేటగిరీలకు చెందినవారు అండగా , విదేశీ ఓటర్లు 95 మంది ఉన్నారు.

ఇటీవల సెప్టెంబర్ 2న విడుదలైన ప్రాథమిక జాబితాలో 3,92,669 ఓటర్లు ఉన్నారు. నిరంతర సవరణల తరువాత 6,976 మంది కొత్తగా చేర్చారు, 663 మందిని తొలగించారు. దీంతో మొత్తం సంఖ్య 3,98,982కి చేరింది. సేవా ఓటర్లను కలుపుకుని తుది సంఖ్య 3,99,000 గా తేలింది. ఓటర్ల సంఖ్య ఆధారంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక నిర్వహణకు 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget