West Indies Cricket | ప్రపంచ క్రికెట్ చరిత్రలో వెస్ట్ ఇండీస్ ఓ విచిత్రం | ABP Desam
ప్రపంచపటంలో లేని ఓ దేశం ప్రపంచ క్రికెట్ ప్రపంచాన్ని ఏలింది. ప్రత్యర్థి జట్లకి వణుకుపుట్టించింది. ఆ దేశ బ్యాటర్ల బాదుడుకి ఇప్పటికీ ఎంతోమందికి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ దేశ బౌలర్ల బౌలింగ్ గురించి తల్చుకుంటే.. ఇప్పటికీ కొంతమంది బ్యాట్స్‌మెన్ వణికిపోతారు. అక్కడిదాకా ఎందుకు..? క్రికెట్ పుట్టింది ఇంగ్లీష్ దేశాల్లో అయినా.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇండియా లాంటి దేశాలన్నింటినీ భయపెడుతూ.. దాదాపు 2, 3 దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిందా దేశం. అదే వెస్ట్ ఇండీస్. క్రికెట్ ఆడే ప్రతి టీమ్ జెర్సీపై ఆ దేశ జెండా ఉంటుంది. అది ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్.. చివరికి నేపాల్ అయినా సరే.. వాళ్ల దేశం జెండాని చాలా ప్రౌడ్‌గా జెర్సీపై ధరిస్తుంది. కానీ మీరెప్పుడైనా..? విండీస్ జెర్సీపై కానీ.. కనీసం వాళ్ల ఫ్యాన్స్ చేతుల్లో కానీ ఎప్పుడైనా వెస్ట్ ఇండీస్ దేశ జెండాని చూశారా..? లేదు కదా.? ఎందుకంటే.. అసలు అలాంటి దేశమే ప్రపంచంలో లేదు. నిజానికి.. వెస్ట్ ఇండీస్ అనేది కరీబియన్ దీవులన్నీ ఒక్కటిగా కలిసి ఏర్పాటు చేసుకున్న క్రికెట్ బోర్డు. కరీబియన్ దీవుల్లో.. జమైకా, ట్రినిడాడ్ & టొబాగో, బార్బడోస్, గయానా, ఆంటిగ్వా అండ్ బార్బుడా.. ఇలా రకరకాల దేశాలుంటాయి. ఓ రకంగా ఒక్కో దీవి ఒక్కో దేశం అనుకోవచ్చు.





















