Breaking News Live: పిడుగుపాటుకు ఇద్దరు గొర్రెల కాపర్లు మృతి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 24న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. నేతల మధ్య డైలాగ్స్ పేలుతున్నాయి. మీ రెండు పార్టీలు కుమ్మక్కైయ్యాయి.. లేదు మీ రెండు పార్టీలే కుమ్మక్కైయ్యాయని మాటకి మాట బదులిస్తున్నారు. ఈటల రాజేందర్ బీజీపీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి అని మంత్రి కేటీఆర్ అగ్గిలో ఆజ్యం పోశారు. కేటీఆర్ కామెంట్స్ పై బీజేపీ, కాంగ్రెస్ గట్టిగానే బదులిచ్చాయి. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.
గోల్కొండ రిసార్ట్స్‌లో తాను, ఈటల కలిశామని కేటీఆర్ అంటున్నారని, అది బహిరంగ రహస్యమే అన్నారు. ఈటల రాజేందర్‌తో చీకటి ఒప్పందం కోసం కలవలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. వేం నరేందర్‌రెడ్డి కుమారుడి లగ్న పత్రిక సందర్భంగా తాము కలిశామన్నారు. కేసీఆర్ చేసే కుట్రలన్నీ ఈటల వివరించారన్నారు. ఈటల, కిషన్ రెడ్డి భేటీ ఏర్పాటు చేసిందెవరని ప్రశ్నించారు. టీఆర్ఎస్ బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకుందన్నారు. కిషన్‌రెడ్డి కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిందెవరని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
Also Read: Burj Khalifa: బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ చిత్రం.. కేసీఆర్, కవిత ఫోటోలు కూడా.. మీరూ చూడండి
రేవంత్ రెడ్డిని కలిశా.. అయితే ఏంటి : ఈటల
హుజూరాబాద్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఈటల రాజేందర్ - రేవంత్ రెడ్డి రహస్యంగా సమావేశమయ్యారని కేటీఆర్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. కాదని చెపితే తాను ఫొటోలు బయటపెడతానని కేటీఆర్ సవాల్ చేశారు. దీనిపై హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ స్పందించారు. రేవంత్ రెడ్డిని కలిశానని అయితే ఏంటని ప్రశ్నించారు. అయితే రేవంత్ రెడ్డిని కలిసింది బీజేపీలో చేరిన తర్వాత కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత చాలా మందిని కలిశానని అప్పుడే రేవంత్ రెడ్డిని కూడా కలిశానని స్పష్టం చేశారు.
కేటీఆర్‌వి గాలి మాటలు: భట్టి విక్రమార్క
మంత్రి కేటీఆర్ గాలి మాటలు మాట్లాడుతున్నారని, ఆయన నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రేవంత్, రాజేందర్‌లు కలిశారని, ఆ రెండు పార్టీలు కలిసి హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని చెప్పారు. భిన్న ధ్రువాలైన కాంగ్రెస్, బీజేపీలు హుజూరాబాద్ ఎన్నికలో ఎలా కలిసి పనిచేస్తాయని ప్రశ్నిం చారు.
Also Read: ఆ సాక్ష్యాలు బయట పెడతా.. ఎన్నికల కమిషన్ చేసిన పని కరక్టేనా.. ప్లీనరీ ఏర్పాట్లలో కేటీఆర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
పిడుగుపాటుకు ఇద్దరు గొర్రెల కాపర్లు మృతి
అనంతపురం జిల్లా పిడుగుపాటుతో ఇద్దరు గొర్రెల కాపర్లు మృతి చెందారు. బ్రహ్మ సముద్రం మండలం బొమ్మగానీపల్లి గ్రామానికి చెందిన గాటు తిమ్మన్న (70), మోహన్ నాయక్ (44) పిడుగుపాటుకు మరణించారు. వర్షం కారణంగా ఇద్దరు ఓ చెట్టుకిందకు వెళ్లారు. ఆ సమయంలో పిడుగుపాటుకు గురై మృతి చెందారు.
తిరుపతిలో విస్తృత తనిఖీలు... క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడినత కఠిన చర్యలు
తిరుపతి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్రికెట్ బెట్టింగ్ లను అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. జిల్లా ఉన్నాధికారుల పర్యవేక్షణలో క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడే వారిపై నిరంతర నిఘా పెట్టాలని ఆదేశించారు.
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మరో ఆరుగురి అరెస్టు
గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మీడియాలో వచ్చిన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నారు. వీరిలో నలుగురు విజయవాడకు చెందిన వారు కాగా, ఇద్దరు గుంటూరుకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ఈ కేసులో గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన 10 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా విజయవాడకు చెందిన జోగరాజు, షేక్ బాబు, షేక్ సైదా, సూర్య సురేష్, గుంటూరుకు చెందిన మోహన్ కృష్ణారెడ్డి, గురవయ్యలను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.
ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నాయి : మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి
ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టడం వైసీపీ రాజకీయమని టీడీపీ నేత, మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం తిరుపతిలో మాట్లాడిన ఆయన ప్రశాంత్ కిషోర్ సలహాలతోనే వైసీపీ ప్రతిపక్షంపై ఇలాంటి దుష్చర్యలకు పాల్పడుతుందన్నారు. 2019కి ముందు ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియాను వాడుకుని తప్పులు ప్రచారం చేసి వైసీపీని అధికారంలోకి తెచ్చాడని, అప్పుడు సోషల్ మీడియాలలో ఆక్టివ్ గా ఉన్న వైసీపీ ఇప్పుడు ఏమి చెప్పలేక సైలెంట్ అయ్యారని విమర్శించారు.
కర్ణాటకలో భారీ వర్షాలు.. అనంతపురం జిల్లా చిత్రావతి నదిలోకి భారీగా వరద నీరు
కర్ణాటక రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు అనంతపురం జిల్లాలోని పరగొడు డ్యాం నిండింది. చిత్రావతి నదిలోకి వరద నీరు చేరుతోంది. గోరంట్ల మీదుగా పుట్టపర్తి కి చేరుకున్న వరద నీరు. చిత్రావతి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు బుక్కపట్నం చెరువులోకి భారీగా నీరు చేరడంతో పారుతున్న మరవ. కొత్త చెరువు, బుక్కపట్నం మరవ వద్ద పర్యాటకుల సందడి చేస్తున్నారు.