(Source: ECI/ABP News/ABP Majha)
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ.. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక జొరవతో నిజామాబాద్ లోని పలు నియోజకవర్గాలకు నిధులు మంజూరయ్యాయి. రూ. 2.30 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవతో నిజామాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపి) ద్వారా నిజామాబాద్ అర్బన్, బోధన్, బాల్కొండ నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
బోధన్ మండలంలోని మినార్ పల్లి గ్రామంలో రూ.50 లక్షలతో కమ్యూనిటీ హాల్, నవీపేట్ మండలం పొతంగల్ గ్రామంలో రూ.50 లక్షలతో పాఠశాల భవనం, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్సీ కవిత నిధులు విడుదల చేయించారు. బోధన్ మున్సిపాలిటీలోని 37 వ వార్డులో రూ. 10 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సైతం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
నిజామాబాద్ అర్బన్ లోని 42వ డివిజన్ లో గల కమ్యూనిటీ హాల్ ప్రహారీ గోడ నిర్మాణానికి రూ.10 లక్షలు, 6, 15, 16 ,25, 50 వ డివిజన్ లలో ఒక్కో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5 లక్షలు మరియు డివిజన్ 16లోని మెట్టు కుమార్ గల్లీలో గల మున్నూరు కాపు సంఘ భవనంలో వివిధ పనుల నిమిత్తం రూ.5 లక్షల నిధులు విడుదల అయ్యాయి.
బాల్కొండ మున్సిపాలిటీలో వివిధ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ.25 లక్షలు, మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5 లక్షలు, ముప్కాల్ మండలం కొత్తపల్లి గ్రామంలో వివిధ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ.30 లక్షల నిధులు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
వివిధ గ్రామాలు, మండలాల్లో అభివృద్ధి పనులకు భారీగా నిధులు విడుదల చేయడంపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిధులు విడుదల చేసేందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ కవితకి జిల్లా ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Pushpa Movie: 'పుష్ప'కు కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్నది పెద్ద సాయమే...
Also Read: Inter Results 2021: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల... రిజెల్ట్స్ కోసం ఇలా చెక్ చేసుకోండి
Also Read: Hyderabad Containment Zone: హైదరాబాద్‌లో మళ్లీ కంటైన్మెంట్ జోన్.. ఈ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటన
Also Read: Nizamabad: గల్ఫ్ బాధితుడికి ఎమ్మెల్సీ కవిత చేయూత.. సొంత ఖర్చులతో స్వగ్రామానికి..
Also Read: Kamareddy: ఈ ఊర్లో లిక్కర్ అమ్మితే రూ.లక్ష, కొనాలంటే రూ.50 వేలు.. నాలుగేళ్ల నుంచి ఇంతే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి