Pushpa Movie: 'పుష్ప'కు కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్నది పెద్ద సాయమే...
'పుష్ప' సినిమాకు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్నది పెద్ద సాయమే. అయితే... ఏపీలో అటువంటి సాయం లభించే మాత్రం కనిపించడం లేదు.
తెలంగాణలో రెండు వారాల పాటు ఐదో షో వేసుకోవడానికి 'పుష్ప' సినిమాకు కెసిఆర్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అధికారులకు ఈ మేరకు ఆదేశాలు కూడా వెళ్లాయి. దాంతో శుక్రవారం ఉదయమే, ఆరు గంటల ప్రాంతాల్లో నైజాం వ్యాప్తంగా 'పుష్ప' విడుదల అవ్వడం ఖాయమని తెలుస్తోంది.
Also Read: హైకోర్టు క్లారిటీ.. జాయింట్ కలెక్టర్ ఓకే అంటేనే టిక్కెట్ రేట్ల పెంపు .!ప్రభుత్వం కరుణిస్తేనే పుష్పకు కలెక్షన్లు !
నైజాంలో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ ('దిల్' రాజు) ఐదో షోకు అనుమతి ఇవ్వవలసిందిగా కెసిఆర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దాంతో సానుకూలంగా స్పందించి రెండు రెండు వారాలు ఐదో ఆటకు అనుమతులు ఇచ్చారు. ఆల్రెడీ టికెట్ రేట్లు పెంచుకోవడానికి గతంలో అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ తర్వాత 'అఖండ'తో థియేటర్లకు కళ వచ్చింది. 'పుష్ప'కు మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ఐదో షోకు అనుమతి లభిస్తే... ఫస్ట్ వీకెండ్, వీక్ ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుంది. నిర్మాతలు తొలి వారంలో వీలైనంత రాబట్టుకోవచ్చు. ఈ లెక్కన చూస్తే... 'పుష్ప'కు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది పెద్ద సాయమే.
Also Read: కర్ణాటకలో 'పుష్ప'ను బాయ్‌కాట్ చేస్తారా? సినిమాపై కన్నడిగులు ఎందుకు కోపంగా ఉన్నారు?
మరోవైపు మరో తెలుగు రాష్ట్రం ఏపీలో ఇటువంటి సాయం కనిపించే పరిస్థితులు కనిపించడం లేదు. ఆల్రెడీ రేట్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టేయడంతో ఏపీ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ నాలుగు షోలకు మాత్రమే అనుమతి ఉంది. ఐదో షో వేస్తే... కేసులు పెట్టడానికి ప్రభుత్వ అధికారులు సిద్ధంగా ఉన్నారట.
View this post on Instagram
Also Read: ఏడాది ఆఖరి రోజున... సమరానికి సిద్ధమంటున్న అర్జునుడు!
Also Read: ఇటు సునీల్... అటు హెబ్బా... విలన్‌గా అతడు!
Also Read: 'సంచారి'... 'రాధే శ్యామ్' నుంచి మరో వీడియో సాంగ్ వచ్చేసింది!
Also Read: 'లైగర్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రౌడీ బాయ్! ప్రభాస్ సినిమా వెనుక...
Also Read: మరో కపూర్‌కు కరోనా...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి