Vijay Devarakonda: 'లైగర్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రౌడీ బాయ్! ప్రభాస్ సినిమా వెనుక...
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'లైగర్'. వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ రోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
![Vijay Devarakonda: 'లైగర్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రౌడీ బాయ్! ప్రభాస్ సినిమా వెనుక... Vijay Devarakonda's first pan India film Liger release date finalized Vijay Devarakonda: 'లైగర్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రౌడీ బాయ్! ప్రభాస్ సినిమా వెనుక...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/16/55eefab66db52a3255533a916bf1f86f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'లైగర్'. రౌడీ బాయ్‌కు ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇది. ఇంతకు ముందు 'డియర్ కామ్రేడ్'ను నాలుగు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేశారు. ఈసారి అలా కాకుండా హిందీ మీద కూడా కాన్సంట్రేషన్ చేశారు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ రోజు (గురువారం, డిసెంబర్ 16న) సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఆగస్టు 25, 2022న సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సరిగ్గా ఈ సినిమాకు రెండు వారాల ముందు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రభాస్ సినిమా వెనుక... విజయ్ దేవరకొండ సినిమా... వచ్చే ఏడాది ఆగస్టులో టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన రెండు పాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయనున్నాయి అన్నమాట.
It’s Time.
— Vijay Deverakonda (@TheDeverakonda) December 16, 2021
A long journey culminates in Two very important dates!
Stay Ready..
And Remember the words that have been said. #Liger pic.twitter.com/XZT9irEorb
'లైగర్'లో విజయ్ దేవరకొండకు జంటగా అనన్యా పాండే నటించారు. ఆమెకు తొలి తెలుగు సినిమా ఇది. బాక్సింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ నెల 31న ఇయర్ ఎండ్ సందర్భంగా సినిమా గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికాలోని లాస్ వేగాస్ లో ఆయనపై సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థాయ్‌లాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లు డిజైన్ చేస్తున్నారు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.
Also Read: ఆ ఒక్క విషయంలో బన్నీని బీట్ చేయబోతున్న నాని!?
Also Read: మరో కపూర్‌కు కరోనా...
Also Read: అక్కడ తెలుగు సినిమాలు చూడటం 'ఆర్య'తో మొదలుపెట్టారట... అలాగే మీడియాకు సారీ
Also Read: అందాల రాక్షసి మనసూ అందమైనదే... బర్త్‌డే రోజు అనాథలతో!
Also Read: మరో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌కు రెడీ అయిన సౌజన్యా శ్రీనివాస్... త్రివిక్రమ్ వైఫ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)