AP Tickets GO : హైకోర్టు క్లారిటీ.. జాయింట్ కలెక్టర్ ఓకే అంటేనే టిక్కెట్ రేట్ల పెంపు .!ప్రభుత్వం కరుణిస్తేనే పుష్పకు కలెక్షన్లు !
టిక్కెట్ రేట్ల పెంపు కోసం ధియేటర్ యజమానులు జాయింట్ కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని.. ఆయనే నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు ప్రకటించింది. ప్రభుత్వ అప్పీల్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది.
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల విషయంలో హైకోర్టు కీలక ఆదే్శాలు జారీ చేసింది. టిక్కెట్ ధరలను పెంచాలనుకుటే ధియేటర్ల యజమానులు ముందుగా తమ ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్లకు సమర్పించాలని ... ఆయనే నిర్ణయం తీసుకుంటారని స్ప్టం చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించాలని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. గత ఏప్రిల్‌లో సినిమాల టిక్కెట్ రేట్లను ఖరారు చేస్తూ జీవో నెం.35ను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. అవి మరీ తక్కువగా ఉన్నాయని ధియేటర్ యజమానులు హైకోర్టులో పిటిషన్ వేశారు. టిక్కెట్ ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని వాదించారు.
Also Read: 'లైగర్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రౌడీ బాయ్! ప్రభాస్ సినిమా వెనుక...
దీనిపై హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం మూడు రోజుల కిందట తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.35ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పాద విధానంలోనే టిక్కెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పించింది. పాత విధానం అంటే.. గతంలో కొత్త సినిమా విడుదలయినప్పుడు తొలి రెండు వారాలు టిక్కెట్ రేట్లను పెంచుకునేందుకు జాయింట్ కలెక్టర్లు అనుమతి ఇచ్చేవారు. ఇప్పుడు కూడా అదే పద్దతిలో టికెట్ రేట్లను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. శుక్రవారమే ఫుష్ప సినిమా విడుదల కావాల్సి ఉంది.
Also Read: పుష్ఫ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నానంటే... రౌడీ హీరో ట్వీట్, సమాధానమిచ్చిన అల్లు అర్జున్
టిక్కెట్ రేట్ల విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఏపీలో ఇంకా బుకింగ్స్ ప్రారంభం కాలేదు. ఇప్పుడు ధియేటర్ యజమానులు టిక్కెట్ రేట్ల ప్రతిపాదనలతో జాయింట్ కలెక్టర్ల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. వారు ఓకే అంటే పెంచిన ధరలతో టిక్కెట్లను అమ్ముతారు. లేదంటే అఖండ సినిమాకు ఎంత మేర టిక్కెట్ రేట్లు ఉన్నాయో.. అదే తరహాలో టిక్కెట్లను అమ్మనున్నారు. అంటే కలెక్షన్లు దాదాపుగా అరవై శాతం వరకూ తగ్గిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు టిక్కెట్ రేట్ల పెంపు అంశం జాయింట్ కలెక్టర్ల చేతుల్లో ఉంది.
Also Read: ప్రకాష్ రాజ్ ఆర్ధికసాయంతో బ్రిటన్లో చదివి ఉద్యోగం సాధించిన పేద యువతి... హ్యాట్సాఫ్ సర్
ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్ రేట్ల పెంపును ఆమోదించకూడదన్న ఉద్దేశంలో ఉంది కాబట్టి... ప్రభుత్వాన్ని కాదని జాయింట్ కలెక్టర్లు టిక్కెట్ రేట్ల పెంపునకు పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదు. దీంతో పుష్ప సినిమా యూనిట్, డిస్ట్రిబ్యూటర్లు ఏం నిర్ణయం తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది. విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది కాబట్టి.. పుష్ప టిక్కెట్ రేట్లు ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉన్నట్లే..!
Also Read: తండ్రికి అనసూయ ప్రామిస్.. సోషల్ మీడియాలో హార్ట్ టచింగ్ పోస్ట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి