Boycott Pushpa: కర్ణాటకలో 'పుష్ప'ను బాయ్‌కాట్ చేస్తారా? సినిమాపై కన్నడిగులు ఎందుకు కోపంగా ఉన్నారు?
అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాకు కర్ణాటక ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. ఈ సినిమాపై వాళ్ల నుంచి ఎందుకు వ్యతిరేకత వ్యక్తం అవుతోంది? ఏమిటి? అంటే...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా నటించిన 'పుష్ప: ద రైజ్ (Pushpa The Rise)పై కన్నడిగులు కారాలు మిరియాలు నూరుతున్నారు. సినిమాను కర్ణాటకలో బాయ్ కాట్ చేయాలని పిలుపు ఇస్తున్నారు. దీనికి కారణం కర్ణాటకలో కన్నడ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్‌ను ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తుండటమే! తెలుగు వెర్షన్ సుమారు 200 థియేటర్లలో విడుదల అవుతుంటే... కన్నడ వెర్షన్ కేవలం మూడు థియేటర్లలో మాత్రమే విడుదల అవుతోంది. దీనిపై కన్నడ ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 'బాయ్ కాట్ పుష్ప ఇన్ కర్ణాటక' (Boycott Pushpa In Karnataka) హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్ ట్రెండ్ స్టార్ట్ చేశారు.
Also Read: ఆ ఒక్క విషయంలో బన్నీని బీట్ చేయబోతున్న నాని!?
"మీ సినిమాను కర్ణాటకలో విడుదల చేయాలనుకుంటే ఇతర వెర్షన్స్ కంటే కన్నడ వెర్షన్ ఎక్కువ థియేటర్లలో విడుదల చేయండి. ఏంటిది? తెలుగు వెర్షన్ 200 కంటే ఎక్కువ థియేటర్లలో... హిందీ వెర్షన్ 10 ప్లస్, మలయాళ వెర్షన్ 4 ప్లస్, కన్నడ వెర్షన్ కేవలం 3 థియేటర్లలోనా? అదీ కర్ణాటకలో" అని ఒకరు ట్వీట్ చేశారు.
If you want to release ur movie in Karnataka better release Kannada version more than any version. What is this? Telugu version200+,hindi vsn 10+,malayalam vsn 4+, tamil vsn 4+ & Kannada version 3 shows just 3 that too in Karnataka 🤬#BoycottPushpaInKarnataka #PushpaTheRise #Ban pic.twitter.com/09FbUp96dd
— MadhuRSYCult (@Madhu_RSYCult) December 15, 2021
తెలుగు వెర్షన్ 'పుష్ప'ను కర్ణాటకలో ప్రజలపై రుద్దడమేంటి? మార్కెటింగ్ టీమ్ తప్పు చేస్తోందని, కన్నడిగులకు ఇది నచ్చదని, కర్ణాటక అంతా కన్నడలో విడుదల చేయకపోతే తాను సినిమా చూడనని జీరల్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.
Dear @alluarjun, why are you dumping Telugu version in Karnataka when you have Kannada version? You and your marketing team has got it all wrong. This is not going well with Kannadigas. I won't watch Pushpa unless released in Kannada across Karnataka.#BoycottPushpaInKarnataka
— Chetan Jeeral | ಚೇತನ್ ಜೀರಾಳ್ (@chetanjeeral) December 16, 2021
"తెలుగు ప్రజలు 'కేజీఎఫ్'ను కన్నడలో, 'ఏంథిరన్' (రోబో)ను తమిళంలో, 'బెంగళూరు డేస్'ను మలయాళంలో చూస్తారా? లేదు కదా! రెండు గంటల పుష్ప సినిమా కోసం మా కన్నడ భాషను ఇన్‌సల్ట్ చేయలేము" అని ఇంకొకరు ట్వీట్ చేశారు.
#BoycottPushpaInKarnataka#boycottpushpa
— maya / ಮಾಯ (@maya_das__) December 15, 2021
Will telugu ppl watch kgf in kannada,Enthiran in tamil, Bangalore days in Malayalam?
Ans: is NO
We can't insult n forget our kannada lang for 2 hrs pushpa movie
ನಮ್ಮ ಭಾಷೆ ನಮ್ಮ ಹೆಮ್ಮೆ#Bengaluru #kannada #kicchasudeepa #dboss #yash #appu pic.twitter.com/dh4fxNC1SF
కన్నడిగులు 'పుష్ప' సినిమా బృందం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే... కొందరు సపోర్ట్ కూడా చేస్తున్నారు. "కన్నడ వెర్షన్ మూడు షోస్ ఫిల్ కాలేదు" అని ఒకరు అంటే... "డిమాండ్ అండ్ సప్లై ప్రకారం ఏదైనా ఉంటుంది. తెలుగు వెర్షన్ 100 ప్లస్ థియేటర్లలో విడుదల చేస్తే, 50 థియేటర్లు హౌస్ ఫుల్ అవుతాయి. అదే కన్నడ వెర్షన్ 100 థియేటర్లలో విడుదల చేస్తే 10-20 మాత్రమే ఫుల్ అవుతాయి. ఇందులో తప్పేముంది?" అని ఇంకొకరు ట్వీట్ చేశారు.
Really!!#BoycottPushpaInKarnataka ?
— Gokul ッ (@IamGokulVJ) December 16, 2021
It's all about SUPPLY - DEMAND.
If they rls Telugu version there say 100 they can have 50+ shows in full occupancy basis get packed.
Whereas if they release 100 in Kannada version merely 10-20 may get filled. What's wrong here.#Pushpa
'పుష్ప' సినిమాలో కథానాయిక రష్మికా మందన్న కన్నడ అమ్మాయే. అన్నట్టు... 'పుష్ప' సినిమా ప్రచారం నిమిత్తం అల్లు అర్జున్ అండ్ టీమ్ బెంగళూరు వెళ్లినప్పుడు రెండు గంటలు ఆలస్యంగా ప్రెస్ మీట్ స్టార్ట్ చేశారని ఒకరు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితం కర్ణాటకలో డబ్బింగ్ సినిమాలపై నిషేధం ఉండేది. అది తొలగించిన తర్వాత పరభాషా సినిమాలు కన్నడలో డబ్బింగ్ చేసి విడుదల చేయడం వలన కన్నడ స్ట్రయిట్ సినిమాలకు అన్యాయం జరుగుతోందని కొందరు వాపోతున్నారు.
Also Read: ఇటు సునీల్... అటు హెబ్బా... విలన్‌గా అతడు!
Also Read: 'సంచారి'... 'రాధే శ్యామ్' నుంచి మరో వీడియో సాంగ్ వచ్చేసింది!
Also Read: 'లైగర్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రౌడీ బాయ్! ప్రభాస్ సినిమా వెనుక...
Also Read: మరో కపూర్‌కు కరోనా...
Also Read: అక్కడ తెలుగు సినిమాలు చూడటం 'ఆర్య'తో మొదలుపెట్టారట... అలాగే మీడియాకు సారీ
Also Read: అందాల రాక్షసి మనసూ అందమైనదే... బర్త్‌డే రోజు అనాథలతో!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి