By: ABP Desam | Updated at : 16 Dec 2021 12:16 PM (IST)
'గీత'లో హెబ్బా పటేల్, సునీల్
హెబ్బా పటేల్... 'కుమారి 21 ఎఫ్'తో తెలుగునాట పాపులర్ అయిన హీరోయిన్. ఆ విజయం తర్వాత కమర్షియల్ కథానాయికగా కొన్ని సినిమాలు చేశారు. '24 కిస్సెస్' వంటి సినిమాల్లో గ్లామరస్‌గానూ కనిపించారు. ఇప్పుడు మళ్లీ కంటెంట్ బేస్డ్,ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్నారు. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ సినిమా 'గీత'. మ్యూట్ విట్నెస్... అనేది ఉప శీర్షిక! ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే... కమెడియన్ కమ్ హీరో సునీల్ మెయిన్ రోల్ చేస్తున్నారు. 'నువ్వే కావాలి'లో సెకండ్ హీరోగా, 'ప్రేమించు'లో హీరోగా నటించడంతో పాటు పలు సినిమాలు చేసిన సాయి కిరణ్ విలన్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అనాథల కోసం మూగ యువతి పాత్రలో హెబ్బా పటేల్ కనిపించనున్నారు.
ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్ శిష్యుడు విశ్వ' ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గ్రాండ్ మూవీస్ పతాకంపై ఆర్. రాచయ్య నిర్మిస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. త్వరలో సినిమా విడుదల తేదీని వెల్లడించనున్నారు. వీవీ వినాయక్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అనంతరం సినిమా మంచి హిట్ అవ్వాలని, తన శిష్యుడు విశ్వ దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని, తన మిత్రుడు రాచయ్య నిర్మాతగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. 'గీత' సినిమా అవకాశం తనకు రావడానికి వినాయక్ గారే కారణం అని, ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రాచయ్య గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చిత్ర దర్శకుడు విశ్వ పేర్కొన్నారు. హిందీ 'ఛత్రపతి' షూటింగ్, ఇతర పనులతో బిజీగా ఉన్నప్పటికీ... తమ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన వినాయక్ కు కృతజ్ఞతలు అని నిర్మాత ఆర్. రాచయ్య తెలిపారు. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, '30 ఇయర్స్' పృథ్వీ, తనికెళ్ల భరణి తదితరులు నటించిన ఈ సినిమాకు సాగర్ పాటలు, సుభాష్ ఆనంద్ స్వరాలు, ఎస్. చిన్నా నేపథ్య సంగీతం అందిస్తున్నారు.
Also Read: 'సంచారి'... 'రాధే శ్యామ్' నుంచి మరో వీడియో సాంగ్ వచ్చేసింది!
Also Read: 'లైగర్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రౌడీ బాయ్! ప్రభాస్ సినిమా వెనుక...
Also Read: ఆ ఒక్క విషయంలో బన్నీని బీట్ చేయబోతున్న నాని!?
Also Read: మరో కపూర్‌కు కరోనా...
Also Read: అక్కడ తెలుగు సినిమాలు చూడటం 'ఆర్య'తో మొదలుపెట్టారట... అలాగే మీడియాకు సారీ
Also Read: అందాల రాక్షసి మనసూ అందమైనదే... బర్త్‌డే రోజు అనాథలతో!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Bigg Boss Telugu 7: ‘స్పా’ బ్యాచ్‌లో మనస్పర్థలు - టమాటాల గురించి శోభా, ప్రియాంకల గొడవ
Lokesh Kanagaraj Fight Club : ఫైట్క్లబ్తో వస్తున్న లోకేశ్ కనగరాజ్.. డైరక్టర్‌గా మాత్రం కాదు
Naga Panchami November 29th Episode : కరాళి ప్రాణత్యాగం.. రంగంలోకి ఫణేంద్ర.. పంచమికి అండగా సుబ్బు!
Krishna Mukunda Murari November 29th Episode : గత జ్ఞాపకాల్లో మురారి ముకుందతో పెళ్లికి ఏర్పాట్లు.. ముహూర్తం ఫిక్స్!
Bigg Boss Telugu 7: గౌతమ్‌కు ప్రియాంక సపోర్ట్ - వెధవను అయిపోయాను అంటూ అమర్ సీరియస్
Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం
Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి
Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!
Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!
/body>