అన్వేషించండి
Advertisement
Prabhas's Radhe Shyam: 'సంచారి'... 'రాధే శ్యామ్' నుంచి మరో వీడియో సాంగ్ వచ్చేసింది!
'రాధే శ్యామ్' నుంచి మరో సాంగ్ వచ్చింది. 'సంచారి' అంటూ సాగే ఈ సాంగ్ ఎలా ఉందో చూడండి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే జంటగా రూపొందిన సినిమా 'రాధే శ్యామ్'. 'జిల్' ఫేమ్ కె.కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ సినిమాలో రెండు పాటలను విడుదల చేశారు. మూడో సాంగ్ 'సంచారి' టీజర్ మొన్న మంగళవారం విడుదల అయ్యింది. ఈ రోజు (గురువారం, డిసెంబర్ 16న) ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు.
గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మిస్తున్న 'రాధే శ్యామ్' కోసం... దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. 'సంచారి' పాటకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా... అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. 'చలో... చలో... సంచారి! చల్ చలో... చలో! చలో... చలో... సంచారి! చల్ చలో... చలో... కొత్త నేలపై' అంటూ పాటను కృష్ణకాంత్ (కెకె) రాశారు. సినిమాలో హీరో ట్రావెలింగ్ చేసే సమయంలో వచ్చే పాటలా ఉంది ఇది.View this post on Instagram
సినిమాలో రెండు పాటలు (ఈ రాతలే..., నగుమోము తారలే) గతంలోనే విడుదల చేశారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి, మురళీ శర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: 'లైగర్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రౌడీ బాయ్! ప్రభాస్ సినిమా వెనుక...
Also Read: ఆ ఒక్క విషయంలో బన్నీని బీట్ చేయబోతున్న నాని!?
Also Read: మరో కపూర్‌కు కరోనా...
Also Read: అక్కడ తెలుగు సినిమాలు చూడటం 'ఆర్య'తో మొదలుపెట్టారట... అలాగే మీడియాకు సారీ
Also Read: అందాల రాక్షసి మనసూ అందమైనదే... బర్త్‌డే రోజు అనాథలతో!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also Read: ఆ ఒక్క విషయంలో బన్నీని బీట్ చేయబోతున్న నాని!?
Also Read: మరో కపూర్‌కు కరోనా...
Also Read: అక్కడ తెలుగు సినిమాలు చూడటం 'ఆర్య'తో మొదలుపెట్టారట... అలాగే మీడియాకు సారీ
Also Read: అందాల రాక్షసి మనసూ అందమైనదే... బర్త్‌డే రోజు అనాథలతో!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
లైఫ్‌స్టైల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion