(Source: ECI/ABP News/ABP Majha)
Hyderabad Containment Zone: హైదరాబాద్‌లో మళ్లీ కంటైన్మెంట్ జోన్.. ఈ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటన
ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉన్నందున వైద్య అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. కేసులు గుర్తించిన వారు నివాసం ఉంటున్న ఇళ్ల నుంచి చుట్టుపక్కల 25 ఇళ్ల పరిధిలో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు.
ఒమిక్రాన్ వేరియంట్ హైదరాబాద్‌లో గుర్తించడంతో ఆ ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. దీంతో తాజాగా నగరంలో మరోసారి కంటైన్మెంట్ జోన్ ఏర్పడినట్లయింది. టోలిచౌకీలోని పారామౌంట్ కాలనీలో ఇద్దరు విదేశీ వ్యక్తులకు ఒమిక్రాన్ ఉన్నట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. వారు ప్రస్తుతం గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఇద్దరూ టోలిచౌకీ పారామౌంట్ కాలనీకి చెందిన వారు కావడంతో ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉన్నందున వైద్య అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
ఒమిక్రాన్ కేసులు గుర్తించిన వారు నివాసం ఉంటున్న ఇళ్ల నుంచి చుట్టుపక్కల 25 ఇళ్ల పరిధిలో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. కాలనీలోని అపార్ట్‌మెంట్లలో అధికారులు.. ఆ ఇద్దరు ఒమిక్రాన్ రోగులు సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఇప్పటికే మొదలుపెట్టారు. ఒమిక్రాన్ పాజిటివ్ వ్యక్తులకు దగ్గరగా ఉన్నవారి నమూనాలను పరీక్షలకు పంపారు. ఆ ఫలితాలు 24 గంటల్లోపు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నేడు (డిసెంబరు 16) కూడా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ప్రత్యేక టీమ్‌లు రంగంలోకి దిగనున్నాయి. ఆ కాలనీలో మరింత మంది ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించి పరీక్షలు చేయనున్నారు. పారామౌంట్ కాలనీ మొత్తం యాంటీబాక్టీరియల్ మందును స్ప్రే చేశారు. బాధితులతో దగ్గరగా మెలిగిన వారిని హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు.
Also Read: Hyderabad Drugs: ఓఆర్ఆర్ వద్ద ఇద్దరు యువకులు, యువతి.. ముగ్గురూ కలిసి కారులో.. అడ్డంగా బుక్
కంటైన్మెంట్ జోన్ అంటే..
కరోనా కేసులు ఉన్నట్లయితే ఆ ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తారు. కేసుల తీవ్రను ఆధారంగా చేసుకుని వీటిలో కూడా రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్‌లుగా విభజించారు. కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా మొదలయ్యే అవకాశం ఉన్నాయనే అంచనాలు ఉంటే ఆ ప్రాంతాలను బఫర్ జోన్ అంటారు. కంటైన్మెంట్ జోన్ చుట్టూ ఉన్న ప్రాంతాలని బఫర్ జోన్‌లుగా పేర్కొంటారు.
అత్యధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు ఉండి, వైరస్ ఇన్‌ఫెక్షన్ శాతం ఎక్కువగా పెరుగుతున్న ప్రాంతాలను రెడ్ జోన్‌లుగా పేర్కొంటారు. వీటినే హాట్ స్పాట్ జోన్లు అని కూడా పిలుస్తారు. కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాలను ఆరెంజ్ జోన్ అంటారు. గ్రీన్ జోన్ అంటే.. కొద్ది కాలంగా కొత్తగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాని, అసలు ఒక్క పాజిటివ్ కేసు కూడా లేని ప్రాంతాలను గ్రీన్ జోన్‌గా పరిగణిస్తారు.
Also Read: Eatala Rajender: పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీ చేయడానికి రెడీ..: ఈటల రాజేందర్
Also Read: Kamareddy: ఈ ఊర్లో లిక్కర్ అమ్మితే రూ.లక్ష, కొనాలంటే రూ.50 వేలు.. నాలుగేళ్ల నుంచి ఇంతే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి