అన్వేషించండి

Singareni Good News: కాంట్రాక్ట్‌ సిబ్బందికి గుడ్‌న్యూస్, రూ.30 లక్షల ప్రమాద బీమా ప్రకటించిన సింగరేణి

Singareni Accidental Insurance | సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంస్థ ప్రమాద బీమా వర్తింపజేసింది. కాంట్రాక్ట్ సిబ్బందికుటుంబాలకు రూ.30 లక్షల ఉచిత ప్రమాద బీమా వర్తింపజేస్తామని చెప్పారు.

Singareni to provide Accidental Insurance coverage to contract workers - హైదరాబాద్: సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎట్టకేలకు సంస్థ శుభవార్త చెప్పింది. సింగరేణిలో పని చేస్తున్న దాదాపు 25 వేల మంది కాంట్రాక్టు సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పించేందుకు వీలుగా 30 లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా వర్తింపజేస్తామని ప్రకటించారు. హెచ్‌డీఎఫ్‌సీ శాలరీ అకౌంట్ కలిగి ఉన్న ప్రతీ కాంట్రాక్ట్ ఉద్యోగికి ప్రమాద బీమా అమలు చేస్తామని సింగరేణి ఛైర్మన్ అండ్ ఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. 

ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగికి ప్రమాద బీమా సౌకర్యం

సింగరేణి భవన్ లో కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమంపై సంస్థ డైరెక్టర్లు, ఏరియా జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం సాయంత్రం బలరామ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి ఛైర్మన్ అండ్ ఎండీ బలరామ్ మాట్లాడుతూ..  ప్రమాద బీమా సదుపాయం వర్తించాలంటే ప్రతీ కాంట్రాక్ట్  ఉద్యోగి HDFC బ్యాంక్ లో శాలరీ అకౌంట్ (Salary Accont) కలిగి ఉండాలన్నారు. ఏరియా జీఎంలు సంబంధిత కాంట్రాక్టర్ల  ద్వారా సింగరేణి కాంట్రాక్ట్ సిబ్బందికి అవగాహన కలిగించాలని ఆదేశించారు. 

రూ.1 కోటి ప్రమాద బీమా పథకం 
సింగరేణి ఉద్యోగుల కోసం ఇదివరకే ఎస్‌బీఐ (SBI), యూనియన్ బ్యాంక్ ద్వారా రూ.1 కోటి ప్రమాద బీమా పథకాన్ని సీఎం, డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ప్రారంభించామన్నారు. కాంట్రాక్టు కార్మికుల సంక్షేమం కోసం ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీతో ఒప్పందం చేసుకున్నారు.  30 లక్షల ప్రమాద బీమా వర్తించేలా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.50 లక్షల వరకు ప్రమాద బీమా వర్తింపజేయాలని ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబ సభ్యుల సామాజిక, ఆర్థిక భద్రతలో భాగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

‘సింగరేణి ఆసుపత్రులలో కాంట్రాక్టు కార్మికులకు వైద్య సేవలు అందిస్తున్నాం. వారి కుటుంబానికి, పిల్లలకు సైతం ఆరోగ్య సేవలు అందించడంపై ఈఎస్ఐ (ESI Hospitals) ఆసుపత్రుల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుగుతున్నాం. మొదటగా కొత్తగూడెం, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (NTPC)లలో ఈఎస్ఐ ఆసుపత్రుల ద్వారా సింగరేణి ఉద్యోగులకు వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. కార్మిక చట్టాలు, కోర్టు ఆదేశాల ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులకు తప్పనిసరిగా పీఎఫ్ (PF), సీఎంపీఎఫ్, పింఛన్ కోసం జీతంలో కొంత రికవరీ చేస్తాం. కాంట్రాక్టర్ల ద్వారా అంతే నగదును కలిపి వారి ఖాతాల్లో జమ చేయనున్నాం.   

వెబ్ అప్లికేషన్ ద్వారా నమోదు
కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు, పీఎఫ్ (PF), సీఎంపీఎఫ్ చెల్లింపులు సకాలంలో జరిగేందుకు వారికి సంబంధించిన మస్టర్లను కూడా వెబ్ అప్లికేషన్ ద్వారా నమోదు చేసే ప్రక్రియను చేపడతాం. ఆగస్టు మొదటి వారం నుంచి అమలు లోకి తీసుకొస్తాం. సిబ్బంది వారి మస్టర్ల నమోదు ఆధారంగా జీతాలు సహా, పీఎఫ్, సీఎంపీఎఫ్ చెల్లింపులు వారి ఖాతాల్లోకి జమ చేసే వీలుంటుంది’ అని ఎన్ బలరామ్ వివరించారు.

Also Read: BRS News: ‘రేవంతూ జనం జాడిస్తరు మిమ్మల్ని’ - బడ్జెట్‌పై బీఆర్ఎస్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget