Rahul To Telangana : ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై కీలక ప్రకటన చేసే చాన్స్
Rahul Gandhi: ఐదో తేదీన రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. సంవిధాన్ సమ్మాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
Rahul Gandhi will visit Hyderabad on the 5th November: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు నవంబర్ ఐదో తేదీన రానున్నారు. ‘సంవిధాన్ సమ్మాన్’ అనే కార్యక్రమాన్ని రాహుల్ దేశవ్యాప్తంగా చేపట్టారు. అందులో బాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గరగా ఉండేందుకు కొత్త కొత్త కార్యక్రమాల పేరిట ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నం చేస్తోంది. నిత్యం ప్రజలు, కార్యకర్తలతో దగ్గరయ్యేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారు. సంవిధాన్ సమ్మాన్‌లో ప్రధానంగా రాహుల్ గాంధీ కులగణనపై ప్రసంగిస్తున్నారు. తెలంగాణలో కులగణనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ప్రజలకు సందేశం ఇచ్చేందుకు ఆయన రానున్నారు.
మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
కులగణనను బీజేపీ వ్యతిరేకిస్తోంది. కానీ రాహుల్ చేసి తీరాలంటున్నారు. ఇప్పటి వరకూ వివిద ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగిన సంవిధాన్ సమ్మాన్ కార్యక్రమాల్లో కులగణనకు అనుకూలంగా ప్రచారం చేశారు. దేశ జనాభాలో 90 శాతం మంది ఇప్పటికీ వ్యవస్థకు దూరంగా మిగిలిపోయారని రాహుల్ అంటున్నారు. వారికి తగిన స్థాయిలో భాగస్వామ్యం లభించాలంటే కులగణన తప్పనిసరి అని వాదిస్తున్నారు. దేశంలోని పారిశ్రామికవేత్తల్లో ఎస్‌సీ, ఎస్‌టీ, గిరిజన కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉందని ప్రతిభ ఉన్నప్పటికీ వారికి పాలనా వ్యవస్థలో భాగస్వాములయ్యే అవకాశం కింది కులాలకు రావడం లేదన్నారు. అందువల్లే తాము కులగణన చేపట్టామని చెబుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపడుతున్న కులగణన అంటే అది కేవలం కులాల లెక్కలు కాదు. ప్రభుత్వ విధానాల రూపకల్పనకు పునాది అని రాహుల్ గాంధీ చెబుతున్నారు. కులగణన చేసినంత మాత్రాన సరిపోదు. వివిధ కులాల మధ్య సంపద పంపిణీ ఎలా ఉందో అధ్యయనం చేయాలి. అదేవిధంగా బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ, మీడియాలో ఓబీసీలు, దళితులు, కార్మికుల భాగస్వామ్యం ఎంతుందో కూడా తెలుసుకోవాలని రాహుల్ అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన జరుపుతుందని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తుందని సంవిధాన్ సమ్మాన్ కార్యక్రమాల్లో రాహల్ చెబుతున్నారు.
తెలంగాణలో ఒంటిపూట బడులు, సమ్మర్ కాకున్నా ఇప్పుడు ఎందుకంటే!
తెలంగాణలోనూ కులగణనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీ బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం కావడంతో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చిన్న తప్పు లేకుండా కులగణన చేసేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. నవంబర్ 6 నుంచి తెలంగాణ వ్యాప్తంగా కుల గణన ప్రక్రియ మొదలుకానుంది. అయితే ఈ సమగ్ర కుటుంబ సర్వే ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. స్కూలు టైమింగ్స్ పూర్తయ్యాక ఉపాధ్యాయులు రోజుకు 5 నుంచి 7 ఇళ్లల్లో సమగ్ర సర్వే చేయనున్నారు. అందుకే ఐదో తేదీనే రాహుల్ గాందీ సందేశం ఇవ్వనున్నారు.