Todays Top News:
టీడీపీ-జనసేన మధ్య విభేదాలు..!
ఏపీలో కూటమి ప్రభుత్వంలో అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం నేతల మధ్య పెద్దగా పొసగడం లేదన్న వాదన వినిపిస్తోంది. టీడీపీ-జనసేన నేతల మధ్య విభేదాలు భగ్గుమనడం ఆ పార్టీలను ఆందోళన పరుస్తోంది. టీడీపీ అధినేత
చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎంత సఖ్యతతో ఉన్నా స్థానికంగా మాత్రం నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. నెమ్మదిగా ఈ విభేదాలు, విమర్శలు, ప్రతి విమర్శలకు దారి తీస్తున్నాయి.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
త్వరలో రెడ్‌బుక్ మూడో చాప్టర్.. లోకేశ్ మైండ్ గేమ్
అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి
నారా లోకేశ్ అట్లాంటా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రెడ్‌బుక్‌లో రెండు చాప్టర్లు ఓపెన్ అయ్యాయని, త్వరలోనే మూడో చాప్టర్ తెరుస్తామన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. లోకేష్ ప్రకటించిన రెడ్ బుక్ మూడో చాప్టర్‌పై ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం
ఏపీలో నిలిచిపోయిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్టు రిక్రూట్‌మెంట్ బోర్డు ఇన్‌ఛార్జి ఛైర్మన్ రవికృష్ణ తెలిపారు. ఈ ఏడాది డిసెంబరు చివరి వారంలో ఫిజికల్ టెస్ట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2022లో నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులకు గతేడాది జనవరిలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
షర్మిలకు అండగా పవన్ కల్యాణ్
జగన్ సోదరి షర్మిలకు రక్షణ కల్పిస్తామని
పవన్ కల్యాణ్ అన్నారు. షర్మిల.. తన ప్రాణాలకు రక్షణ కావాలని... అదనంగా సెక్యూరిటీ కల్పించాలని అడిగారని తెలిపారు. అమ్మా.. మీ అన్న కల్పించలేకపోయాడేమో కానీ మీ ప్రాణాలకు కూటమి ప్రభుత్వం రక్షణగా ఉంటుందని పవన్ అన్నారు. ఓ బాధ్యత గల నాయకురాలిగా మీరు ఎన్ని విమర్శలైనా చెయ్యొచ్చని... మీరు అప్పీల్ చేసుకోండి. సీఎం దృష్టికి తీసుకెళ్లి మీకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకుంటామని పవన్ తెలిపారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
వైఎస్ ఆస్తుల వివాదం..టీడీపీ ప్రశ్నల వర్షం
వైఎస్ కుటుంబంలో ఏర్పడిన ఆస్తుల వివాదాన్ని టీడీపీ రాజకీయంగా
జగన్ పై ఎటాక్ చేయడానికి ఉపయోగించుకుంటోంది. ఏ చిన్న అవకాశాన్నీ వదిలి పెట్టకుండా సంచలన ఆరోపణలు చేస్తోంది. ఎన్నికలకు ముందు విజయమ్మ ఇండియాలో లేరు. షర్మిల కుమారుడితో కలిసి అమెరికా వెళ్లిపోయారు. ఎన్నికలు అయిపోయాకే తిరిగి వచ్చారు. దానిపై అప్పట్లో అనేక ప్రచారాలు జరిగాయి. కానీ అసలు విషయం ఇదేనంటూ టీడీపీ కొత్తగా ఆరోపణలు ప్రారంభించింది. అప్పట్లో జరిగిన విజయమ్మ కారు ప్రమాదంపై తాజాగా టీడీపీ పోస్ట్ చేసింది
. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
బీజేపీ ఎల్పీ నేత బయట పెట్టిన టాప్ సీక్రెట్ ?
తెలంగాణ సీఎంను మారుస్తారంటూ బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గిపోయిందని ప్రకటించారు. 2025 జూన్ లేదా డిసెంబర్ లో తెలంగాణకు కొత్త ముఖ్య మంత్రి వస్తారని జోస్యం చెప్పారు. దీంతో తెలంగాణలో ఇప్పుడు కొత్త చర్చ ప్రారంభమయింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఖర్గే వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
రాష్ట్ర బడ్జెట్‌ను మించి గ్యారంటీలు ఇవ్వొద్దని.. అలా చేస్తే దివాళా తీసే పరిస్థితి వస్తుందని
కాంగ్రెస్ ఛీప్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ‘గాలిమాటల గ్యారంటీలిస్తే మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు అర్థమైందా? బడ్జెట్ చూసుకోకుండా హామీలిస్తే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తప్పదని ఇప్పుడు బోధపడిందా మీకు. ఆరు గ్యారంటీలతో వల వేసినప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి మీకు తెలియదా' అని అన్నారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
వీడిన కడియపులకం హత్యాచార కేసు
తూర్పుగోదావరి జిల్లా కడియపులంక బుర్రిలంక ప్రాంతానికి చెందిన రౌతు కస్తూరి(44) హత్యాచార కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 15న కూలి పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కూలి పనికి వెళ్లి తిరిగి వస్తుండగా పలు దృశ్యాలు సీసీ టీవీ పుటేజీల్లో లభించాయి. పోలీసులు ఆ ప్రాంతంలో పని చేసే నలుగురు యువకులను పట్టుకుని తమదైన శైలిలో విచారిస్తే అసల విషయం చెప్పారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
విజయ్‌తో పొత్తుకు అన్నాడీఎంకే ఆసక్తి
తమిళనాట రెండేళ్ల తర్వాత జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. స్టాలిన్‌కు ధీటైన నాయకత్వం ఇతర పార్టీల్లో లేదని చర్చ జరుగుతున్న సమయంలో దళపతి విజయ్ తన తమిళగ వెట్రి కళగం పేరుతో తెర ముందుకు వచ్చేశారు.ఒంటరిగా పోటీ చేయడానికి రెడీ అని, అయినా అవసరమైతే పొత్తుల గురించి ఆలోచిస్తామన్నరు. దీంతో అన్నాడీఎంకే నేతల్లో పొత్తు ఆశలు పుడుతున్నాయి.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
రష్యాకు సపోర్టుగా ఉత్తర కొరియా సైన్యం
రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా రంగంలోకి దిగింది. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న పోరాటానికి తన తరపున పదివేల మంది వరకూ సైనికుల్ని పంపాలని నిర్ణయించింది. కిమ్ జోంగ్ ఉన్ క్రూరమైన ఉత్తరకొరియా నియంతగా పేరు పొందారు. ఆయనకు చైనా, రష్యాతో తప్ప ఏ దేశంతోనూ సంబంధాలు ఉండవు. ఆ రెండు దేశాల అధినేతలో ప్రెండ్ షిప్ కొనసాగిస్తారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..