అన్వేషించండి

Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 

Telangana Assembly Sessions 2024: తెలంగాణలో ధరణీ పోర్టల్‌ను రద్దు చేసిన ప్రభుత్వం భూభారతి పేరుతో కొత్త చట్టం తీసుకొచ్చింది. ప్రజల భూముల రక్షణ కోసం దీన్ని తీసుకొచ్చినట్టు చెప్పింది.

Telangana News: తెలంగాణలో ఆర్‌వోఆర్ చట్టం-2020ను పూర్తిగా ప్రక్షాళన చేసిన ప్రభుతవం కొత్తగా భూభారతి బిల్లును తీసుకొచ్చింది. అనేక రోజులు పరిశోధనల తర్వాత దీన్ని రూపొందించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభలో ప్రకటించారు. ఈ బిల్లు ఏర్పాటుకు ప్రతిపక్షాలు కూడా సలహాలు సూచలు చేశాయని గుర్తు చేశారు. ఈ బిల్లుతో తెలంగాణలోని ప్రతి ఇంచు భూమికి రక్షణ దొరుకుతుందని అభిప్రాయపడ్డారు.  

ప్రజల భూముల రక్షణతోపాటు కబ్జాదారుల భరతం పట్టేందుకు ఈ బిల్లు సహకరిస్తుందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. పదేళ్లు భూములను కబ్జాలు చేసిన వారి పని పడతామని సభా వేదికగా హెచ్చరించారు. ప్రజల భూములను కంటికి రెప్పలాకాపాడుకుంటామన్నారు. అనాలోచితంగా తీసుకొచ్చిన ధరని పోర్టల్ వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు. ఇందులో ఉన్న ఇబ్బందులు బీఆర్‌ఎస్ నేతలకి కూడా తెలుసన్న మంత్రి... ఇబ్బందులు వస్తాయని వారు నోరు విప్పడం లేదన్నారు.  

ధరణితో కొందరికే మేలు జరిగిందన్న మంత్రి పొంగులేటి... లక్షల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కాకపోవడంతో అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. భూ యజమానులకు తెలియకుండానే రికార్డులు తారుమారు అయ్యేవని అందుకే దీన్ని పూర్తిగా బంగాళాఖాతంలో కలిపేసి ప్రజాభిష్ఠం మేరకు కొత్త చట్టం తెచ్చామని పేర్కొన్నారు.  

ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం రూపొందించడానికి లక్షల మంది ప్రజల అభిప్రాయాలు, రిటైర్డ్ ఉద్యోగుల ఆలోచనలు, ప్రతిపక్షాల మాటలను కూడా పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు మంత్రి. హరీష్‌రావు, వినోద్ కుమార్ లాంటి వాళ్లు కూడా సలహాలు ఇచ్చారని గుర్తు చేశారు.  

సభలో తాగుడు పంచాయితీ

ప్రశ్నోత్తరాల టైంలో సభలో మంత్రులు, హరీష్‌ రావు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణలో రోడ్ల అంశంపై అడిగిన ప్రశ్నకు మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ మామ చాటు అల్లుడిగా ఉంటూ వేల కోట్లు దోచుకున్నారని కూలిపోయే కాళేశ్వరం కట్టారని విమర్శించారు. వాళ్లకు కమీషన్లు తీసుకోవడమే తెలుసని.. ప్రజలకు మంచి చేయడం తెలియదన్నారు. ఉప్పల్‌లో ఓ ఫ్లైఓవర్ పూర్తి చేయని వాళ్లు తమ ఫామ్‌హౌస్‌లకు నాలుగు లేన్ల రోడ్లు వేసుకున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే మార్చి నాటికి భూసేకరణ పూర్తి చేసిన నాలుగేళ్లలో త్రిబుల్ ఆర్ పూర్తి చేస్తామన్నారు.  

దీనికి కౌంటర్‌గా హరీష్‌రావు మాట్లాడుతూ.. తాను కమీషన్‌ తీసుకున్నట్టు నిరూపించాలని సవాల్ చేశారు. కొంతమంది సభ్యులు సభకు తాగి వస్తున్నారని అందుకే డ్రంకన్ టెస్టు పెట్టాలని సభాపతికి సూచించారు. కోమటి రెడ్డి కమీషన్ల చిట్టా విప్పితే తట్టుకోలేరని హెచ్చరించారు. తనపై ఆయన చేసిన కామెంట్స్ రికార్డుల నుంచి తొలగించాలన్నారు.  

హరీష్‌రావు కామెంట్స్‌ను మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. ఇలాంటి మాటలు సరికాదని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన కామెంట్స్‌ కేసీఆర్‌ను గుర్తుకు తెచ్చినట్టు ఉందన్నారు విప్‌ బీర్ల ఐలయ్య. స్పీకర్ జోక్యం చేసుకొని హరీష్‌, బీర్ల ఐలయ్య మాటలు రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.  

 

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget