అన్వేషించండి

RedBook Third Chapter: రెడ్‌బుక్ పేరుతో లోకేష్ మైండ్ గేమ్ ఆడుతున్నారా ? మూడో చాప్టర్ సరే రెండు చాప్టర్లలో ఎవరిని శిక్షించారు ?

Andhra Pradesh: లోకేష్ ప్రకటించిన రెడ్ బుక్ మూడో చాప్టర్‌పై ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. అసలు రెండు చాప్టర్లలో ఎవరిపై చర్యలు తీసుకున్నారని టీడీపీ క్యాడర్ కూడా ఆశ్చర్యపోతోంది.

Nara Lokesh: అమెరికాలో నారా లోకేష్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత కీలక ప్రకటన చేశారు. రెడ్ బుక్‌లో ధర్డ్ చాప్టర్ అమలు చేయబోతున్నామని చెప్పారు.దీంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మొదటి చాప్టర్లు ఏమయ్యాయి .. వాటిలో ఎంత మందిపై చర్యలు తీసుకున్నారనే. అదే సమయంలో మూడో చాప్టర్‌లో కీలకమైన వ్యక్తులపై చర్యలు ఉంటాయా లేకపోతే అది కూడా మెరుపు తీగలా మాయమైపోయి.. రెడ్ బుక్‌ను అమలు చేసేశామని అంటారా అన్న ఉత్సుకత పార్టీ కార్యకర్తల్లో ఏర్పడుతోంది. 

లోకేష్ రెడ్‌బుక్‌పై పార్టీ కార్యకర్తల్లో ఎన్నో అంచనాలు

ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో నారా లోకేష్ నోటి వెంట రెడ్ బుక్ అనే మాట ఖచ్చితంగా వచ్చేది. తప్పు  చేసిన ప్రతి ఒక్కడి పేరును అందులో నమోదు చేస్తున్నామని తాము రాగానే వేటాడి వెంటాడుతామని చెప్పేవారు. పాదయాత్ర ముగింపు సభలో ఆ రెడ్ బుక్‌ను చూపించారు కూడా. అందులో ఎవరి పేర్లు ఉన్నాయో ఎవరికీ తెలియదు. కానీ టీడీపీ కార్యకర్తల్ని, టీడీపీ అధినేతను ఇబ్బంది పెట్టిన వారందరి పేర్లు ఉంటాయన అందరూ అనుకున్నారు. అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయో లోకేష్ బయట పెట్టలేదు. కానీ ఆ రెడ్ బుక్‌కు ఓ ఇమేజ్ వచ్చింది. ప్రతీకారంతో రగిలిపోయే టీడీపీ కార్యకర్తల్లో జోష్ నింపింది. 

ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం

పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిదానమే ప్రధానం !

టీడీపీ గెలిచిన వెంటనే నారా లోకేష్ రెడ్  బుక్ ఓపెన్ చేసి.. ప్రతి ఒక్కరి తాట తీస్తారని కార్యకర్తలు అనుకున్నారు. వారి ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉండేవంటే.. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలను.. నేతల్ని కేసులు పెట్టి ఎలా వేధించారో.. స్టేషన్లకు తీసుకెళ్లి ఎలా ధర్డ్ డిగ్రీ ప్రయోగించారో వాటికి బాధ్యులైన వారందరికీ అలాంటిది రెట్టింపు చూపిస్తారని అనుకున్నారు. కానీ అధికారం అందిన తర్వాత రెడ్ బుక్  అమలు చట్టబద్దంగా ఉంటుందని ప్రకటించారు. ఓ వైపు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని వైసీపీ విమర్శలు చేస్తోంది. మరో అసలు రెడ్ అమలే చేయడం లేదని టీడీపీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఓ సందర్భంలో లోకేష్ రెడ్ బుక్ అమలు ప్రారంభమయిందని చెప్పారు .ఇప్పుడు అది మూడో దశకు చేరిందని అంటున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తల్లోనే అయోమయం ఏర్పడింది.

ఉద్యోగం పేరుతో రూ.90 లక్షలు మోసం చేసిన మాజీ మంత్రి - మెరుగు నాగార్జునపై మహిళ ఫిర్యాదు !

మూడో ఫేజ్‌లో అయినా కఠిన చర్యలు కోరుకుంటున్న  క్యాడర్

రెండు ఫేజ్‌లలో  ఏం చేశారో లోకేష్ చెప్పలేదు. కానీ వైసీపీ హయాంలో  రూల్స్ ఉల్లంఘించిన అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం ఒక్కటే కళ్ల ముందు కనిపిస్తోంది. తమపై వేధింపులకు పాల్పడిన ఎవరిపై చర్యలు లేవు. నిబంధనలు ఉల్లంఘించి ఊరూవాడా ప్రెస్‌మీట్లు పెట్టిన  సీఐడీ చీఫ్ సంజయ్ పై కూడా ఇప్పటి వరకూ ఈగ వాలలేదని.. చంద్రబాబు కుటుంబసభ్యుల డాక్యమెంట్స్ కూడా అక్రమంగాసేకరించి  స్వయంగా నారా  లోకేష్, బ్రహ్మణిని, భువనేశ్వరిని  కూడా అరెస్టు చేసేందుకు కుట్ర చేసిన రఘురామిరెడ్డి, పీఎస్ఆర్ సీతారామాంజనేయులు వంటి వారిపైనా చర్యలు తీసుకోలేదని అంటున్నారు. ఇలాంటి అసంతృప్తి  టీడీపీ కార్యకర్తల్లో ఎక్కువగానే ఉంది. రెడ్ బుక్ విషయంలో నారా లోకేష్ వారి అంచనాలను ఇప్పటి వరకూ అందుకోలేదు. మరి మూడో చాప్టర్లో అయినా అందుకుంటారా? 

టాప్ హెడ్ లైన్స్

BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
BJP New National Executive: నితిన్ నవీన్ టీంలో పురందేశ్వరి, రాంమాధవ్, విష్ణువర్థన్ రెడ్డి - తెలంగాణ నేతలకు దక్కని చోటు !
నితిన్ నవీన్ టీంలో పురందేశ్వరి, రాంమాధవ్, విష్ణువర్థన్ రెడ్డి - తెలంగాణ నేతలకు దక్కని చోటు !
MLC Nagababu Cabinet Rank: కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?
కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget