అన్వేషించండి

Telangana Politics: రేవంత్‌ను మార్చేస్తారా ? బీజేపీ ఎల్పీ నేతకే ఆ సీక్రెట్ ఎలా తెలిసింది ?

Telangana: తెలంగాణ సీఎంను మారుస్తారంటూ బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలపై ఆయనకు విశ్వసనీయ సమాచారం ఉందా ?

BJP LP leader Maheshwar Reddy: తెలంగాణ బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గిపోయిందని ప్రకటించారు.  2025 జూన్ లేదా డిసెంబర్ లో తెలంగాణకు కొత్త ముఖ్య మంత్రి వస్తారని  జోస్యం చెప్పారు.  ఉత్తమ్ కుమార్ రెడ్డి , బట్టి విక్రమార్క , కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలలో ఎవరో ఒకరు ముఖ్య మంత్రి అవుతారని ప్రాబబుల్స్ కూడా ప్రకటించారు. ఇప్పటికే సీఎం రేవంత్ కు రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు.  రేవంత్ ఢిల్లీకి 7 సార్లు వెళ్లారు కానీ రేవంత్ రెడ్డి కి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు.  రేవంత్.. కనీసం ప్రియాంక గాంధీని కలవాలని వయనాడ్ కు వెళ్లినా దర్శనభాగ్యం కలగలేదని మహేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాంటి పరిస్థితి ఉందా లేదా అన్నదానిపై ఇప్పుడు తెలంగాణలో చర్చ ప్రారంభమయింది. 

చాప కింద నీరులా కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు 

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు చాప కింద నీరులా విస్తరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో తెలంగాణలోనూ అలాంటి రాజకీయాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి కంటే దశాబ్దాలుగా తాము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని తామే సీనియర్లమని  భావించేవారికి కొదవలేదు. సీఎం పదవికి తమ కంటే అర్హులు లేరని వాదించేవారికీ కొరత లేదు. అలాంటి వారు హైకమాండ్ వద్ద పలుకుబడి పెంచుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటూ ఉంటారు. అదంతా బహిరంగమే. అయితే పార్టీకి వ్యతిరేకంగా వారెప్పుడూ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కానీ తమ రాజకీయ వ్యూహాలను మాత్రం అమలు చేస్తూనే ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి చెప్పిన ఐదుగురు నేతలే కాదు మరికొంత మంది కూడా తాము సీఎం పదవికి అర్హులమేనని అంటూ ఉంటారు.  

పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు

ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమంలోపాల్గొన్న రేవంత్ 

మహేశ్వర్ రెడ్డి ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ సీఎం మార్పు గురించి ప్రకటన చేశారో కానీ ఆయన చెప్పిన విషయాల్లో చాలా అసత్యాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అపాయింట్‌మెంట్లు ఇవ్వకపోవడం అనేది లేదని ఏడు నెలల కాలంలో రేవంత్ రెడ్డి చాలా సార్లు వారిని కలిశారనిగుర్తు చేస్తున్నారు. ప్రియాంకాగాంధీ నామినేషన్ కు స్వయంగా వాయనాడ్ వెళ్లిన రేవంత్ రెడ్డి ఆమెకు  కాంగ్రెస్ కండువా కప్పారు. ఆ దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. ఆ నామినేషన్ కార్యక్రమంలో ప్రముఖంగా పాల్గొన్నారు. జాతీయ పార్టీలో రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రముఖ నేతగా ఉన్నారు. బీజేపీకి కౌంటర్ ఇచ్చే విషయంలో ఆయన వ్యూహాత్మకంగా ఉంటున్నారు. 

తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్! త్వరలో మద్యం ధరల పెంపు

వచ్చే జూన్, డిసెంబర్ అని చెప్పడంలోనే ఎత్తుగడ ఉందా?

సీఎంను మార్చాలని అనుకుంటే హైకమాండ్ ..  నెలల తరబడి అవకాశం తీసుకోదు. అనుకున్నది వెంటనే మార్చేస్తుంది. మహేశ్వర్ రెడ్డితో హైకమాండ్ సంప్రదించినట్లుగా వచ్చే జూన్ లేదా డిసెంబర్ అంటూ ముహుర్తం చెప్పారు. ఇక్కడే ఆయన కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది నేతల వ్యూహం ప్రకారం మాట్లాడుతున్నారని కొంత మందికి డౌట్ వస్తుంది. మహేశ్వర్ రెడ్డి స్వతహాగా కాంగ్రెస్ నేత. గత ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరి టిక్కెట్ తెచ్చుకుని  గెలిచారు. ఆయనకు చాలా చాలా కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ రేవంత్ తో లేవు. అక్కడే ఆయన కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో జోక్యానికి అవకాశం ఏర్పడిందని భావిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Jeedimetla Fire Accident Today: జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
Maharashtra CM: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌- కేంద్రమంత్రిగా ఏక్‌నాథ్ షిండే!
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌- కేంద్రమంత్రిగా ఏక్‌నాథ్ షిండే!
Lucky Bhaskar OTT Streaming: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి లక్కీ భాస్కర్... 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి లక్కీ భాస్కర్... 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
Embed widget