అన్వేషించండి
Advertisement
Morning Top News: ములుగు ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు, జగన్ పై మంత్రి నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు వంటి మార్నింగ్ న్యూస్
Top 10 Headlines Today: కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజలను వణికిస్తున్న పులులు ఒకటి కాదు నాలుగు, మహారాష్ట్ర సీఎం పీఠాన్ని అధిష్టించేది దేవేంద్ర ఫడ్నవీస్ వంటి మార్నింగ్ టాప్ న్యూస్
Morning Top News:
సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజలను వణికిస్తున్న పులి కోసం వేట ఇంకా కొనసాగుతోంది. మొన్నటి వరకు పశువులపై మాత్రమే దాడి చేసిన పులులు ఇప్పుడు మనుషులపై కూడా దాడులు చేస్తుండటంతో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం అంచనా ప్రకారం ఈ ప్రాంతంలో నాలుగు పులులు తిరుగుతున్నాయని అంటున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో వేస్తామన్నారు. రైతు భరోసా పై మంత్రి వర్గ ఉపసంఘం వేశామన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. రైతు భరోసా కొనసాగుతుంది.. ఎవరికీ అనుమానాలు వద్దు అన్నారు. BRS, BJP నేతల మాటలు రైతులు నమ్మోద్దన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఎన్‌కౌంటర్.. అన్నంలో విష ప్రయోగం జరిగిందా..?
ములుగు జిల్లా ఏటూరునాగారం చల్పాక అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల కమిటీ స్పందిస్తూ ఓ లేఖ విడుదల చేసింది. ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలున్నాయని.. మృతి చెందిన మావోయిస్టులకు అన్నంలో విష ప్రయోగం జరిగినట్లు స్థానిక ప్రజల ద్వారా తెలుస్తోందని పేర్కొంది. మృతదేహాలకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్ష నిర్వహించాలని, ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
జగన్‌కు నాదెండ్ల మనోహర్ సూటి ప్రశ్నలు
వైసీపీ అధినేత జగన్ పాలనపై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్‌కు వరుస ప్రశ్నలు సంధించారు. 'గత ఐదేళ్ల పాటు కాకినాడ పోర్టులోకి ఎవరినీ రానివ్వలేదు. ఇక్కడ కేవలం 20 మంది సెక్యూరిటీనే ఉంచుతారా.. ? మిగతా పోర్టుల కంటే కాకినాడ నుంచే ఎక్కువ ఎగుమతులు ఎందుకు జరిగాయి?" అని ప్రశ్నించారు. కాకినాడ పోర్టుపై వస్తోన్న ప్రశ్నలకు జగన్ జవాబు చెప్పాలని నాదెండ్ల డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
విద్యార్థులకు అలర్ట్.. స్కూల్ సెలవు
తమిళనాడు, పుదుచ్చేరిలో ఫెంగల్ తుపాను బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో ఏపీలో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాలో భారీగా వానలు దంచికొడుతున్నాయి. సోమవారం కూడా కుండపోత వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హచ్చరించడంతో.. చిత్తూరు జిల్లా కలెక్టర్ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
తిరుపతి వాసులకు శ్రీవారి దర్శనం.. ఎప్పటినుంచంటే..?
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని ఇటీవలే టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు స్వామి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 3వ తేదీ నుంచి స్థానిక భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. డిసెంబర్ 2న తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీనగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లు ఉచితంగా జారీ చేస్తారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఖరారు..!
మహారాష్ట్ర సీఎం పీఠాన్ని అధిష్టించేది ఎవరనే ఉత్కంఠకు తెర పడింది. దేవేంద్ర ఫడ్నవీస్ పేరును మహారాష్ట్రకు కాబోయే సీఎంగా బీజేపీ హైకమాండ్ ఫైనలైజ్ చేసింది. ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ నేత ఒకరు అనధికారికంగా ధ్రువీకరించారు. డిసెంబర్ 2న గానీ, 3న గానీ ఎమ్మెల్యేలతో జరిగే సమావేశంలో ఫడ్నవీస్ను బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటారని ఆ సీనియర్ నేత వెల్లడించారు. డిసెంబర్ 5న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య
కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. గచ్చిబౌలిలోని భర్తతో కలిసి ఉంటున్న ఆమె.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటన స్థలానికి చేరకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బ్రహ్మగంతు, నినిదలే సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో నటించిన శోభిత.. గతేడాది వివాహం చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మళ్లీ పెరగనున్న చికెన్ ధరలు..!
కార్తీక మాసం సందర్భంగా ప్రజలు మాంసాహారం తినడం తగ్గించేయడంతో నెల రోజులుగా చికెన్ ధరలు తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ చికెన్ ధర రూ.180 నుంచి రూ.220 వరకూ ఉంది. అయితే వచ్చేది క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి సీజన్. కనుక చికెన్ ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందని వ్యాపారులు అంటున్నారు. చికెన్ ధరలు మరోసారి రూ. 300కుపైగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
సింధు ఈజ్ బ్యాక్..
సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 టోర్నీ సింగిల్స్‌లో భారత షట్లర్ పి.వి.సింధు ఛాంపియన్‌గా నిలిచింది. దెబ్బ తిన్న పులిలా లంఘించి మళ్లీ ఛాంపియన్ గా నిలిచింది. సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 టోర్నీలో ఛాంపియన్ గా నిలిచి తానెంటో నిరూపించుకుంది.రెండేళ్ల టైటిల్ నిరీక్షణకు కూడా తెరదించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement