అన్వేషించండి
Advertisement
PV Sindhu Match: పీవీ సింధు ఈజ్ బ్యాక్.. ఆ టోర్నీలో హవా అంతా మనదే..
Syed Modi International: సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 టోర్నీ సింగిల్స్‌లో భారత షట్లర్ పి.వి.సింధు ఛాంపియన్‌గా నిలిచింది.కెరీర్లో సయ్యద్ మోదీ టైటిల్ నెగ్గడం సింధుకు ఇది మూడోసారి.
PV Sindhu claims Syed Modi International title : పీవీ సింధు(PV Sindhu) పనైపోయింది. ఆమె ఫిట్ నెస్ స్థాయి మునుపటిలా లేదు. సింధు ఇక అంతర్జాతీయ స్థాయిలో రాణించడం కష్టమే. అందుకే సింధు అకాడమీ స్థాపన వైపు దృష్టి సారిస్తోంది. సింధు మునుపటి ఫామ్ అందుకోవడం అంత తేలిక కాదు.. కొంతకాలంగా ఈ విమర్శలకు అంతేలేకుండా పోయింది. ఒలింపిక్స్ లో పతకాశాలను కూల్చేస్తూ వెనుదిరిగిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. ఆ తర్వాత చెప్పుకోదగ్గ విజయాలేవీ సాధించలేదు. దీంతో ఈ విమర్శల దాడి మరింత పెరిగింది. ఈ విమర్శలకు పీవీ సింధు దిమ్మతిరిగే సమాధానం రాకెట్ తోనే చెప్పేసింది. పడిలేచిన కెరటంలా... దెబ్బ తిన్న పులిలా లంఘించి మళ్లీ ఛాంపియన్ గా నిలిచింది. సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 టోర్నీ(Syed Modi International)లో ఛాంపియన్ గా నిలిచి తానెంటో.. తన ఆటెంటో ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది. రెండేళ్ల టైటిల్ నిరీక్షణకు కూడా తెరదించింది.
సాధికార విజయం..
సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 టోర్నీ సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు ఛాంపియన్‌గా నిలిచింది. జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చైనాకుచెందిన వు లువో యును సింధు మట్టికరిపించింది. వు లువో యుపై 21-14, 21-16 వరుస సెట్లలో విజయం సాధించింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో ఆరంభం నుంచే సింధు కసితో ఆడింది. అందరిపైనా సాధికార విజయాలు సాధిస్తూ తుదిపోరుకు చేరుకుంది. ఫైనల్లో చైనా గోడను సింధు దాటగలదా అన్న అనుమానాలు తలెత్తాయి. కానీ ఆ అనుమానాలను సింధు పటాపంచలు చేసింది. చైనాకుచెందిన వు లువో యుపై వరుస సెట్లలో ఓడించింది. తొలి గేమ్ ను 21-14తో సునాయసంగా గెలుచుకున్న సింధుకు.. రెండో గేమ్ లో మాత్రం కాస్త ప్రతిఘటన ఎదురైంది. రెండో సెట్ లో చైనా ప్లేయర్ 10-10తో సింధుకు గట్టిపోటీనే ఇచ్చింది. అయితే తను అనుభవాన్నంత ఉపయోగించి.. బలంగా పుంజుకున్న సింధు.. వరుసగా పాయింట్లు సాధించి 21-16 తేడాతో రెండో సెట్‌ను దక్కించుకుంది. ఈ ఘన విజయంతో రెండేళ్ల తర్వాత సింధు తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్‌ను గెలిచి అభిమానులకు సంతోషాన్ని అందించింది. 2022 జులైలో సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచిన తర్వాత సింధు ఇప్పటివరకూ బీడబ్ల్యూఎఫ్ టైటిల్ గెలవలేదు. ఈ గెలుపుతో ఆ కొరత కూడా తీరిపోయింది.
పురుషుల సింగిల్స్ కూడా మనదే..
సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ 2024 మెన్స్ సింగిల్స్ టైటిల్ విజేతగా స్టార్ షట్లర్ లక్ష్య సేన్ నిలిచాడు. మెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచులో సింగపూర్‌కు చెందిన జియా హెంగ్ జాసన్ తేహ్‌పై లక్ష్యసేనే ఘన విజయం సాధించాడు. 21-6 21-7 తేడాతో వరుస సెట్లలో ప్రత్యర్థిని ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. లక్ష్యసేన్ దూకుడు ముందు అస్సలు ప్రత్యర్థి నిలబడడమే గగనమైపోయింది. రెండు సెట్లను ఏమాత్రం పోరాడకుండానే సింగపూర్ ప్లేయర్.. లక్ష్యకు సమర్పించేశాడు. ఈ ఏడాది లక్ష్య సేన్‌కు ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
క్రికెట్
న్యూస్
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion